ఎటిఎం నెట్‌వర్క్, డిటిహెచ్ సర్వీసులకు ఊతం
బెంగళూరు: భారత తాజా కమ్యూనికేషన్ ఉపగ్రహం జిశాట్- బుధవారం తెల్లవారుజామున ఫ్రెంచ్ గయానా నుంచి యూ రోపియన్ రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించారు. ఈ ఉపగ్రహ ప్రయోగంతో ఎటిఎంల కనెక్టివిటీకి ఊతం లభించడమేకాక, నిరంతరాయంగా డిటిహెచ్ సేవలు అందనున్నాయని భావిస్తున్నారు. కౌరూలో ని ఏరియన్ లాంచ్ కాంప్లెక్స్ నుంచి భారత కాలమానప్రకారం తెల్లవారు జామున 2.31 గంటలకు ఏరియన్-5 వాహకం ద్వారా ఈ కమ్యూనికేషన్ శాటిలైట్‌ను ప్రయోగించారు. ఈ ఉపగ్రహాన్ని 42 నిమిషాల్లో నిర్దిష్ట క్షక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 2,536 కిలోలున్న ఈ జిశాట్- ఉపగ్రహం 15 ఏళ్లు పనిచేస్తుం ది. భారత రోదసి పరిశోధన సంస్థ(ఇస్రో) నిర్మించిన 40వ కమ్యూనికేషన్ శాటిలైట్ ఇది. ‘ఏరియన్-5 ద్వారా జిశాట్- విజయవంతంగా ప్రయోగించడం నాకు గొప్ప ఆనందాన్ని కలిగించింది’ అని ఇస్రోకు చెందిన సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(ఎస్‌డిఎస్‌సి) డైరెక్టర్ ఎస్ పాండియన్ చెప్పారు. ‘ఉపగ్రహాన్ని క్షక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఏరియన్‌స్పేస్‌కు అభినందనలు’ అని కూడా ఆయన చెప్పారు. జిశాట్- హైపవర్ కమ్యూనికేషన్ శాటిలైట్. దీని కెయు-బ్యాండ్ కూడా ఉంది. పైగా ఇది త్వరలో కాలం తీరనున్న కొన్ని ఉపగ్రహాల ఖాళీని భర్తీ చేస్తుంది, సేవలను అందిస్తుంది.
ఏరియన్-5 రోదసి వాహకం(ఫ్లయిట్ విఎ 247) జిశాట్- సౌదీ జియోస్టేషనరీ శాటిలైట్ 1/హెల్లాస్ శాట్4ను కూడా ప్రవేశపెట్టింది. భారత ఉపగ్రహం భారత భూభాగం, దీవులకు కమ్యూనికేషన్ సేవలను అందించనుంది. జియోస్టేషనరి కక్ష్య లో ఉన్న కెయు బ్యాండ్ ట్రాన్స్‌పాండర్ సామర్థ్యాన్ని పెంచనున్నదని ఇస్రో తెలిపింది. విశాట్ నెట్‌వర్క్,టెలివిజన్ అప్‌లింక్స్, డిజిటల్ శాటిలైట్ న్యూస్ సేకరణ, డిటిహెచ్ టెలివిజన్ సేవలకు, సెల్యూలర్ బ్యాక్‌హాల్ కనెక్టివిటీకి, ఇంకా అనేక ఇతర అప్లికేషన్స్‌కు దీనిని ఉపయోగించనున్నారు. ఏరియన్‌స్పేస్ తదుపరి ఇస్రో జియోస్టేషనరీ శాటిలైట్ జిశాట్-30ని ప్రయోగించనుంది. జూన్ లేక జూలైలో దీనిని ప్రయోగించనున్నారు.