అబుదాబి: అబుదాబి వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్థాన్ స్పిన్నర్ యాసిర్ షా అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా యాసిర్ షా కొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ సోమర్విల్లెను ఔట్‌చేసిన షా 200 వికెట్ల క్లబ్లో చేరాడు. అయితే ఈ ఫీట్‌ను యాసిర్ షా 33వ టెస్టులోనే అందుకుని 82 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. టెస్టుల్లో వేగంగా 200 వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. అంతకుమందు 1936లో ఆస్ట్రేలియా బౌలర్ క్లారీ గ్రిమ్మెట్ 36వ టెస్టులో 200 వికెట్లు సాధించాడు. అప్పటి నుంచి ఆ రికార్డు క్లారీ గ్రిమ్మెట్ పేరునే ఉంది. తాజాగా పాక్ బౌలర్ షా దీనిని సవరించాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టిన యాసిర్ షా.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో ఇప్పటివరకు షా 14 వికెట్లు పడగొట్టి మంచి ఫామ్‌ను కనబర్చుతున్నాడు.
కివీస్‌ను ఆదుకున్న విలియమ్సన్, నికొలాస్…
ఇక్కడ పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసవంతంగా సాగుతోంది. పాకిస్థాన్ మొదటి ఇన్నింగ్స్‌లో 348 పరుగులు చేసింది. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులే చేసిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విలియమ్సన్ (139 బ్యాటింగ్), నికొలాస్ (90 బ్యాటింగ్) అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగడంతో భారీ స్కోరువైపు అడుగులు వేసింది. 60 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ కివీస్‌ను విలియమ్సన్, నికొలాస్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. వీరు ఐదో వికెట్‌కు అజేయంగా 212 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో నాలుగో రోజు ఆటముగిసే సమయానికి న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ (282 బంతుల్లో 13 ఫోర్లతో 139 పరుగులు) చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు నికొలాస్ 243 బంతుల్లో 8 ఫోర్లతో 90 పరుగులు చేసి నాటౌట్‌గా క్రీజులో ఉన్నాడు. పాక్ బౌలర్లలో యాసిర్ షా, షాహిన్ అఫ్రిదీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
82 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన యాసిర్ షా…
RELATED ARTICLES