న్యూఢిల్లీ: దసరా సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం పారిస్‌లో ‘ఆయుధ పూజ’ (శస్త్ర పూజ)ను నిర్వహించనున్నారు. తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని ఆయన అందుకోనున్నారని అధికారులు తెలిపారు. చాలా సంవత్సరాలుగా ఆయన ‘ఆయుధ పూజ’ను నిర్వహిస్తున్నా రు. గత ఎన్‌డిఎ ప్రభుత్వంలో ఆయన కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిర్వహించారు. దసరా పండుగలో ఆ యుధ పూజ నిర్వహించడం అన్నది ఒక భాగం. దీనిని దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుపుకుంటారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజు ల పర్యటనపై పారిస్ వెళుతున్నారు. ముఖ్యంగా భారత్‌క అందే 36 రాఫె ల్ యుద్ధ విమానాల్లో తొలి విమానాన్ని ఆయన మంగళవారం అందుకోబోతున్నారు. ఆ రోజు దసరా, భారత వాయుసేన వ్యవస్థాపక దినం కావడం కూడా యాదృచ్ఛికం. అక్టోబర్ 9న ఆయమన ఫ్రాన్స్‌కు చెందిన రక్షణ శా ఖ ప్రముఖులతో విస్తృతంగా చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత సహకారం మరింత బలపడేందుకు ఆయన చర్చలు జరపనున్నారని సమాచారం. రాఫెల్ యుద్ధ విమానం అందుకునే వేడుక ఏర్పాట్లకుగాను ఇప్పటికే భారత వాయుసేన ఉన్నత స్థాయి బృందం పారిస్‌లో ఉంది. అక్కడ వారు ఫ్రాన్స్ అధికారులతో సమన్వయానికి కృషిచేస్తున్నారు.
8న పారిస్‌లో ‘ఆయుధ పూజ’ నిర్వహించనున్న సింగ్
RELATED ARTICLES