బీజింగ్ : కరోనా వైరస్ దెబ్బకు అల్లాడిపోయిన చైనాలో సాధారణ పౌరజీవనం నెలకొంటున్నది. ముఖ్యంగా కరోనా వైరస్‌కు కేంద్ర బిందువుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వుహాన్‌లో పరిస్థితులు కుదుట పడ్డాయి. కరోనా పాజిటివ్ కేసులు పూర్తిగా నియంత్రణలోకి రావడంతో అక్కడ లాక్‌డౌన్ ఎత్తివేసినట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. కోటి 60 లక్షల జనాభా ఉండే వుహాన్ నగరంలోనే తొలిసారిగా కరోనా వైరస్ వ్యాపించిందని చెపుతున్న విషయం తెల్సిందే. జనవరి 23న చైనా ప్రభుత్వం అక్కడ లాక్‌డౌన్ విధించింది. ఆ తర్వాత హుబే ప్రావిన్స్ మొత్తాన్నీ నిర్బంధంలో ఉంచింది. ఎట్టకేలకు 76 రోజుల తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేశారు. ఇప్పుడు వుహాన్ ప్రజలు ఇక స్వేచ్ఛగా తిరిగేయొచ్చు. చైనాలో మంగళవారం కొత్తగా 62 కేసులు నమోదుకాగా, ఇద్దరు మృతి చెందినట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. వుహాన్‌లోని అతిపెద్ద మాంసపు మార్కెట్ కేంద్రంగా కొత్త వైరస్ వ్యాపించినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. వైరస్ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వెంటనే వీరి శాంపిల్స్‌ను లండన్‌ను పంపించి పరిశోధనలు చేపట్టారు. అక్కడి శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి ఈ వైరస్‌ను కరోనావైరస్‌గా గుర్తించారు. ఆ తర్వాత కరోనా వైరస్ ఈ నగరాన్ని అతలాకుతలం చేసింది. దీంతో వైరస్‌ని కట్టడి చెయ్యడానికి లాక్‌డౌన్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. కఠినతరమైన ఆంక్షలతో కరోనాను చైనా ప్రభుత్వం అదుపులోకి తీసుకువచ్చింది.
76 రోజుల తర్వాత చైనాలో లాక్‌డౌన్ ఎత్తివేత!
RELATED ARTICLES