ఎఫ్‌డిఐ మరింత సరళం
కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు
న్యూఢిల్లీ: కొత్తగా 75 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సిసిఇఎ) బుధవారం ఆమోదం తెలిపింది. 2021 నాటికి వాటిని ఇప్పుడున్న జిల్లా ఆసుపత్రులు లేక రిఫరల్ ఆసుపత్రులకు జతచేస్తారు. కొనసాగుతున్న కేంద్రం స్పాన్సర్ చేసిన పథకం మూడో దశ కింద ఈ కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటుచేయనున్నారు. దీంతో దేశంలో కొత్తగా కనీసం 15,700 ఎంబిబిఎస్ సీట్లు పెరుగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భేటీ అయిన కేంద్ర కేబినెట్ బుధవారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను కేంద్రమంత్రులు ప్రకాశ్ జావదేకర్, పీయూష్ గోయల్ మీడియాకు వెల్లడించారు. దేశంలో కొత్తగా 75 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. వీటి నిర్మాణాన్ని 2021 సంవత్సరానికల్లా పూర్తి చేస్తామని చెప్పారు. వైద్య కళాశాలలు లేని ప్రాంతాల్లోనే వాటిని ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యతనివ్వనున్నారు. కనీసం 200 పడకలు ఉన్న జిల్లా ఆసుపత్రులకు ఈ వైద్య కళాశాలలను జతచేయనున్నట్లు ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. 300 పడకలున్న జిల్లా ఆసుపత్రులు, ఔత్సాహిక జిల్లాలకు కేటాయింపులో ప్రాధాన్యతనివ్వనున్నట్లు కూడా ఆ ప్రకటనలో పేర్కొంది. రూ. 24,375 కోట్ల అంచనా వ్యయంతో ఈ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచా రం. దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిపుణులైన వైద్యులు ఉంటారు, మెరుగైన చికిత్స లభించనున్నదని భావిస్తున్నారు. వైద్య సదుపాయాలపై దృష్టి సారించిన ప్రభుత్వం పథకం తొలి దశ కింద 58 వైద్య కళాశాలలను ఏర్పాటుచేసింది. వాటిని జిల్లా ఆసుపత్రులు, రిఫరల్ ఆసుపత్రులకు జతచేసింది. పథకం రెండో దశ కింద 24 వైద్య కళాశాలలను ఏర్పాటుచేసింది. తొలి దశంలో ఆమోదించిన 58 వైద్య కళాశాలల్లో 39 ఇపటికే పనిచేస్తున్నాయి. మిగతా వాటిని 2020 పనిచేసేలా చేయనున్నారు.
75 మెడికల్ కాలేజీలు
RELATED ARTICLES