ప్రపంచ క్రికెట్లో అమెరికా జట్టు చెత్త రికార్డు
నేపాల్‌తో వన్డే మ్యాచ్
కిర్తీపుర్ : వన్డే క్రికెట్ చరిత్రలో మరో అత్యల్ప స్కోర్ నమోదైంది. ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచకప్ లీగ్-2లో అమెరికా జట్టు ఈ చెత్త రికార్డు నెలకొల్పి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం నేపాల్‌తో జరిగిన వన్డేలో అమెరికా 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు.. నేపాల్ సెన్సేషన్ సందీప్ లామిచ్చేన్ (6/16) ధాటికి 12 ఓవర్లలో 35 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ జేవియర్ మార్షల్ (16) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొత్తం ముగ్గురు బ్యాట్స్‌మన్ డకౌట్ కాగా.. మిగతా ఆరుగురు బ్యాట్స్‌మన్ 4,4,2,4,1,1 సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఐదు బంతులను ఎదుర్కొన్న రస్టీ థేరన్(0) నాటౌట్‌గా నిలిచాడు. నేపాల్ బౌలర్లలో లామిచ్చేన్ 6 వికెట్లకు తోడుగా.. సుషన్ భరి (4/5) నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా వన్డే క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్ చేసిన రెండో జట్టుగా నిలిచింది. అమెరికా కన్నా ముందు జింబాబ్వే అతి త క్కువ పరుగుల రికార్డు నమోదు చేసింది. హరారే వేదికగా శ్రీలంకతో 2004లో జరిగిన వన్డేలో ఆ జట్టు 18 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 35 పరుగులకే ఆలౌటైం ది. దీంతో జింబాబ్వే రికార్డును అమెరికా టీమ్ తాజా గా సమం చేసింది. అనంతరం స్వల్ప లక్ష్య చేధనకు దిగిన నేపాల్ 5.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్లు గ్యానేంద్ర మల్లా(1), సుభాష్ ఖాకురేల్(0)లను నౌస్తుష్ కెంజిగే బౌల్ చేయగా.. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ పరాస్ ఖాడ్కా(20), దీపేంద్ర సింగ్ (15) నిలకడగా ఆడి విజయాన్నందించారు.
72 బంతులు.. 35 పరుగులు
RELATED ARTICLES