రాష్ట్రంలో 60 వేలు దాటిన కరోనా కేసులు
కొత్తగా 1811 మందికి పాజిటివ్
మరో 13 మంది మృత్యువాత
ప్రజాపక్షం/హైదరాబాద్
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 60 వేలు దాటింది. బుధవారం ఒక్కరోజే 1811 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 60,717కు చేరుకుంది. మరో13 మంది మరణించగా, ఇప్పటి వరకు 505 మంది మృత్యువాత పడ్డారు. బుధవారం 18,263 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 848 రిపోర్టులు రావా ల్సి ఉన్నది. జాతీయ స్థాయిలో మరణాల సంఖ్య 2.26 శాతం ఉన్నద ని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు బుధవారం నాటి కరోనా హెల్త్ బులెటిన్‌ను గురువా రం విడుదల చేసింది. ఇప్పటి వరకు 4,16,202 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 84 శాతం మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని, రికవరీ రేట్ జాతీయ స్థాయిలో 64 శాతంగా ఉన్నదని వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది. ఒక్క రోజులో జిహెచ్‌ఎంసిలో 521 కేసులు, రంగారెడ్డిలో 289, మేడ్చల్- మల్కాగిజిరిజిల్లాలో 151, వరంగల్ అర్బన్‌లో102 కేసులు న మోదయ్యాయి. వారం రోజుల్లో కరోనాతో 46.13 శాతం మరణించగా ఇతర వ్యాధులతో 53.87 శా తం మంది మృత్యువాతపడ్డారు. టెలిమెడిసిన్, ఏదై నా సమస్యలు ఏమైనా ఉంటే 104 నంబర్‌కు, ప్రైవే టు ఆస్పత్రులకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 9154170960 నంబర్‌కు ఫోన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.
జిల్లాల వారీగా కరోనా లెక్కలు
రాష్ట్రంలో తాజాగా ఆదిలాబాద్‌లో -18 మందికి, భ ద్రాచలం -కొత్తగూడెం-లో 27, జిహెచ్‌ఎంసి-లో 521, జగిత్యాలలో-15, జనగాం-లో 22, జయశంకర్ భూపాల్‌పల్లి-లో 20. జోగులాంబ గద్వాల్-లో 28, కామారెడ్డి-లో 11,కరీంనగర్-లో 97, ఖమ్మం-లో 26, కొమురంబీమ్ ఆసిఫాబాద్-లో 6, మహబూబ్‌నగర్-లో 41, మహబూబాబాద్-లో 39, మం చిర్యాలలో -18, మెదక్‌లో -15, మేడ్చల్- మల్కాజిగిరిలో- 151, ములుగులో- 16, నాగర్‌కర్నూల్-లో 9, నల్లగొండలో- 61, నారాయణపేట్-లో 9, నిర్మల్‌లో -12, నిజామాబాద్-లో 44,పెద్దపల్లి-లో 21, రాజన్న సిరిసిల్లలో 30, రంగారెడ్డిలో -289, సంగారెడ్డిలో -33, సిద్దిపేటలో -24, సూర్యాపేట-లో 37, వికారాబాద్-లో 12, వనపర్తి-లో 23, వరంగల్ రూరల్‌లో -18, వరంగల్ అర్బన్‌లో- 102, యాదాద్రి-భువనగిరిరి -16 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
60,717 కేసులు
RELATED ARTICLES