అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ
ప్రజాపక్షం/హైదరాబాద్
అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ పిలుపులో భాగంగా ఈనెల 6వ తేదీన ప్రభుత్వ నిరంకుశ ధోరణులను నిరసి స్తూ రాష్ర్ట వ్యాప్తంగా మానవహారాలు నిర్వహించాలని రైతు సంఘాల, ప్రజా సం ఘాల నాయకులకు ఎఐకెఎస్‌సిసి రాష్ర్ట కన్వీనర్ పశ్య పద్మ పిలుపునిచ్చారు. ఈ నిరసనలో నల్లరిబ్బన్, బ్యాడ్జి, జెండాలను ప్రదర్శించాలన్నారు. హైదరాబాద్ హి మాయత్‌నగర్‌లోని రాజబహదూర్‌గౌర్ హాలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎఐకెఎస్‌సిసి రాష్ర్ట కన్వీనర్లు టి.సాగర్, వేములపల్లి వెంకట్రామయ్య, ఉపేందర్‌రెడ్డి, జక్కుల వెంకయ్యలతో కలిసి పశ్య పద్మ మాట్లాడారు. కేంద్ర రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని, పంటలకు డాక్టర్ స్వామినాథన్ సూచనల ప్రకారం మద్దతు ధరలు గ్యారంటీగా లభించే విధంగా చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రారంభమైన ఢిల్లీ సరిహద్దుల చుట్టూ రైతు ఉద్యమం ఈనెల 5వ నాటికి 100 రోజులు పూర్తవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య, నిరంకుశ ధోరణులను నిరసిస్తూ మానవహారాలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా నిరసనలు తెలపాలన్నారు. ఈ మేరకు అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ పిలుపునిచ్చిందని చెప్పారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా కిసాన్ దివాస్‌ను నిర్వహించాలన్నారు. మహిళా రైతులను, మహిళా సంఘాలను కలుపుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. 2 డిగ్రీల చలిలో లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులను నిరవదికంగా దిగ్బందనం చేశారన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఇళ్లకు వెళ్ళమంటూ దీర్ఘకాలిక ఉద్యమాన్ని కొనసాగిస్తున్నా.. తమకేమీ పట్టనట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. అలిసిపోయి రైతులు తమ ఉద్యమాన్ని విరమించుకుంటారనే తేలికబారు ఆలోచనలు కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని విమర్శించారు. చట్టాలలో సవరణలు చెప్పండని రైతు ఉద్యమాన్ని పక్కదారి మళ్ళించడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. చారిత్రాత్మకమైన ఉద్యమాన్ని చీల్చడానికి కుటీలయత్నాలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. సాగర్ మాట్లాడుతూ రుణమాఫీ చట్టం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారన్నారు. 2014లో బిజెపి ఎన్నికల ప్రణాళికలో డాక్టర్ స్వామినాథన్ కమిటీ సూచనల ప్రకారం మద్దతు ధరలను అమలు చేస్తామని చెప్పిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. రైతులను మోసం చేశారని విమర్శించారు. మార్చి 8న రైతు వ్యతిరేక కేంద్ర మూడు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రాష్ర్టవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించాలని కోరారు. వెంకట్రామయ్య మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాల అమలును సంవత్సరం పాటు వాయిదా వేశామని ప్రకటించిన ప్రధాని మోడీ ఆచరణలో మద్దతు ధరలు కందులకు ధర క్వింటాకు రూ.6000 ఉంటే ఎక్కడా ఆ ధర రైతులకు అందకపోగా కొన్ని చోట్ల రూ.4 వేలకే అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. మద్దతు ధరలను అమలు చేస్తామంటున్న మోడీ ఎందుకు చట్టం తీసురావడం లేదని ప్రశ్నించారు. ఉపేందర్‌రెడ్డి, జక్కుల వెంకటయ్యలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టంలో పంటలను కొనుగోలు చేయమని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసిన తరువాత ఈ ప్రకటన చేయడం, ఈ చట్టాల వల్ల రైతులకు మేలు జరుగుతుందని మోసపూరిత పూనుకోవడం సిగ్గుచేటన్నారు.
6న మానవహారాలు
RELATED ARTICLES