నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ
8న బడ్జెట్, పద్దులపై…
ప్రజాపక్షం/హైదరాబాద్ రాష్ట్ర బడ్జెట్‌ను ఈ నెల 6న ప్రవేశపెట్టాలని శాసనసభా వ్యవహారాల సలహా సంఘం(బిఎసి) నిర్ణయించింది.గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై అసెంబ్లీలో శనివారం చర్చ చేపట్టనున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం బిఎసి సమావేశం జరిగింది. ఈ నెల 6న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని,8న బడ్జెట్, పద్దులపై చర్చించాలని సమావేశంలో నిర్ణయించారు.ఈ నెల 5, 7 తేదీన అసెంబ్లీ సమావేశాలకు సెలవు ప్రకటించారు.కాగా సభ సమావేశాల తీరును పరిశీలించి
సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనేది నిర్ణయం తీసుకుందామని మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తన్నీరు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. అయితే బడ్జెట్ సమావేశాలను 25 రోజుల పాటు నిర్వహించాలని సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క కోరగా, 20 రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని ఎంఐఎం శాససభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసి స్పీకర్‌కు లేఖ రాశారు. ఎన్ని రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలనేది నిర్ణయించకుండానే బిఎసి ముగిసింది.
6న అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ బిఎసి సమావేశంలో నిర్ణయం
RELATED ARTICLES