5,08,953

భారత్‌లో నమోదైన మొత్తం కరోనా కేసులు
ఒక్క రోజే 18,552 కొత్త కేసులు
24 గంటల్లో 384 మంది మృతి, 15,685కు చేరిన మృతులు
న్యూఢిల్లీ : ‘కరోనా’ ఇప్పుడు ఈ పదం వింటేనే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. భారత్‌లో ఈ మహమ్మారి చాలా వేగంగా వ్యాప్తి చెందుతుండడం కలవర పెడుతుంది. రోజు రోజుకు గణనీయంగా కొత్త కేసులు వస్తుండడం తీవ్ర భయాందోళనలకు గురిచేస్తుంది. దేశంలో నాలుగు లక్షల కేసులు నమోదైన తరువాత కేవలం ఆరు రోజుల్లో ఆ సంఖ్య ఐదు లక్షలను దాటేసింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉద యం నాటికి గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,552 మంది కరోనా బారినపడ్డారు. ఇంత భారీ ఎత్తున కేసులు రావడం ఇప్పటి వరకు ఇదే అత్యధికం. అటు మరణాల సంఖ్య కూడా పరుగులు పెడుతుంది. ఇప్పటి వరకు భారత్‌లో 5,08,953 కేసులు నమోదు కాగా, ఒక్క రోజే 384 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 15,685కు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడిచింది. దేశంలో లక్ష కేసులు నమోదు కావడానికి 110 రోజుల సమయం పడితే, ఐదు లక్షల మార్కును కేవలం 39 రోజుల్లోనే (ఈనెల 27 నాటికి) దాటేశాయి. కాగా, 15 వేలకు పైగా కేసులు నమోదు కావ డం వరుసగా ఇది నాల్గొవ రోజు. ఈనెల 1వ తేదీ నుంచి 27 వరకు కేవలం 27 రోజుల్లోనే 3,18,418 కేసులు రికార్డు అయ్యాయి. ప్రస్తుతం 1,97,387 యాక్టివ్‌ కేసులు ఉండగా, 2,95,880 మంది వైరస్‌ బారి నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. రికవరీ రేటు 58.13గా ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. ఈనెల 26 నాటికి మొత్తం 79,96,707 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్‌) పేర్కొంది. కేవల శుక్రవారం ఒక్క రోజే 2,20,479 శాంపిల్స్‌కు పరీక్షలు నిర్వహించింది. ఇదిలా ఉండగా, మహారాష్ట్రలో కరోనా కేసులు, మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. 24 గంటల్లో 175 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఒక్క రోజే 5 వేల కొత్త కేసులు రావడం కలవర పెడుతుంది. ఇప్పటి వరకు మొత్తం 1,52,765 కేసులు నమోదు కాగా, 7,106 మంది మరణించారు. దేశంలో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ 24 గంటల్లో దాదాపు 4 వేల మంది కరోనా బారిన పడ్డారు. కొత్తగా 63 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 77,240 ఉండగా, మొత్తం 2,492 మంది బలయ్యారు. ఇటు, బాధితుల, అటు మరణాల్లోనూ ఢిల్లీ దేశంలో రెండవ స్థానంలో ఉంది. ఇక తమిళనాడులో కొత్తగా 46 మంది మృతి చెందారు. ఈ రాష్ట్రంలోనూ ఒక్క రోజే దాదాపు 4 వేలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. మొత్తం కేసుసల సంఖ్య 74,622గా ఉండగా, 957 మంది చనిపోయారు. గుజరాత్‌లో మొత్తం కేసులు 30,095 ఉండగా, కొత్తగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,771కు చేరింది. ఉత్తరప్రదేశ్‌లో 24 గంటల్లో 19 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 630 ఉండగా, మొత్తం కేసుల సంఖ్య 20,943గా ఉంది. ఇక పశ్చిమ బెంగాల్‌ మొత్తం 616, మధ్యప్రదేశ్‌లో 546, రాజస్థాన్‌లో 380, తెలంగాణలో 237 మంది మరణించగా, రాజస్థాన్‌లో 16,660, పశ్చిమ బెంగాల్‌లో 16,190, మధ్యప్రదేశ్‌లో 12,798 మంది వైరస్‌ బారిన పడ్డారు.
ప్రధాని వద్ద ఏ ప్లానూ లేదు : రాహుల్‌
దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శల దాడి చేశారు. కరోనా మహమ్మారి కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నా కేంద్ర చర్యలు తీసుకోవడంలేదని మండిపడ్డారు. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రధాని మోడీ వద్ద ఎలాంటి ప్లాన్‌ లేదని, మౌనంగా ఉంటూ, కరోనాపై పోరాటానికి నిరాకరిస్తూ దానికి లొంగిపోయారని విమర్శించారు. ఈ మేరకు శనివార్‌ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. జూన్‌ 9 తర్వాత కరోనాపై కేంద్ర మంత్రుల బృందం భేటీ జరగలేదు. జూన్‌ 11 తర్వాత కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా సంక్షోభంపై సమీక్ష చేయలేదు. ఈ అంశాలకు సంబంధించి ఓ పత్రికలో వచ్చిన వార్తను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. కరోనాపై పోరాడకుండా మోడీ చేతులెత్తేశారని విమర్శించారు.

1087 కేసులు!
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి
జిహెచ్‌ఎంసి పరిధిలో ఒకేరోజు 888 పాజిటివ్‌లు
నల్లగొండ జిల్లాలో భారీగా పెరిగిన కేసులు
కొవిడ్‌ -19కు మరో ఆరుగురు బలి
ప్రజాపక్షం/హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ కనీవినీ ఎరుగని రీతిలో ఒకేరోజు వెయ్యికిపైగా కేసులు నమోదయ్యా యి. వెయ్యి మార్కు దాటడం ఇదే మొదటిసారి. రాష్ట్రంలో వైరస్‌ ప్రభావం తీవ్రంగా వుందని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో యథావిధిగా కరోనా కేసులు

DO YOU LIKE THIS ARTICLE?