రాష్ట్రంలో 50వేలు దాటిన కరోనా కేసులు
మరో 9 మంది కొవిడ్‌కు బలి
ప్రజాపక్షం/హైదరాబాద్: రాష్ట్రంలో కొవిడ్ కేసులు సంఖ్య 50వేలు దాటింది. జిల్లాల్లో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా గురువారం 1567 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, అందులో సగానికి పైగా కేసులు జిల్లాల్లోనే నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో 662 మందికి కొవిడ్ రాగా, ఇతర జిల్లాల్లో వెయ్యికి చేరువగా 905 మందికి కరోనా సోకింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 50,826 కేసులు నమోదు కాగా, 39,327 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం తొమ్మిది మంది కరోనా బారినపడి మృతిచెందగా, మొత్తం మృ తుల సంఖ్య 447కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,052 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జిల్లాకేం ద్రాల నుండి మండల కేంద్రాలు, గ్రామాలకు కూడా కరోనా వైరస్ కోరలు చాస్తుండడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొన్నది. ఒకవైపు రోగుల సంఖ్య పెరుగుతున్నా, మరోవైపు ప్రభుత్వ వైద్యంపై భరోసా తగ్గుతుండడం, ప్రై వేటు ఆసుపత్రు లు అడ్డగోలుగా డబ్బులు వసూలు కొనసాగుతుండడం తో ఆందోళన పెరిగిపోతున్నది. జిహెచ్‌ఎంసి తరువాత గురువారం అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 213 కేసులు, ఆ తరువాత వరంగల్ అర్బన్‌లో 75, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 62, మహబూబ్‌నగర్ జిల్లాలో 61, నాగర్‌కర్నూల్ జిల్లాలో 51 కేసులు నమోదయ్యాయ. జిల్లాల వారీగా మేడ్చెల్ -33, సంగారెడ్డి – 32, ఖమ్మం – 10, కామారెడ్డి – 17, వరంగల్ రూరల్ – 22, నిర్మల్ -1, కరీంనగర్- 38, జగిత్యాల -14, యాదాద్రి భువనగిరి – 4, మహబూబాబాద్ – 18, పెద్దపల్లి-2, మెదక్- 27, మంచిర్యాల – 1, భద్రాద్రి కొత్తగూడెం – 2, జయశంకర్ భూపాలపల్లి – 25, నల్లగొండ – 44, ఆదిలాబాద్-17, ఆసిఫాబాద్-4, వికారాబాద్ – 5, జనగామ – 22, నిజామాబాద్ – 38, ములుగు – 17, సిద్ధిపేట-9, సూర్యాపేట – 39, జోగులాంబ గద్వాల -2 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 3,22,326 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. అలాగే 1,386 ఐసియు బెడ్లు, 2,921 ఆక్సిజన్ బెడ్లు, 10,920 ఐసోలేషన్ బెడ్‌లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. గాంధీ ఆసుపత్రిలో 1,890 బెడ్లు ఉండగా, ఐసియులో 125, ఆక్సిజన్ బెడ్‌లలో 438, వార్డుల్లో 101 కలిపి 664 మంది చికిత్స పొందుతున్నారని, ఇంకా 1226 బెడ్‌లు ఖాళీగా ఉన్నట్లు వివరించింది.
50,826
RELATED ARTICLES