భారత్‌లో 26 లక్షలకు చేరువులో కరోనా బాధితులు
ఒక్కరోజే మరో 63,490 మందికి పాజిటివ్
24 గంటల్లో 944 మంది మత్యువాత
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. గడిచిన వారం రోజులుగా 60వేలకు పైగా తగ్గకుండా కేసులు నమోదవుతున్నా యి. వైరస్‌తో మరణిస్తున్న వారి సంఖ్య కూడా కలవరపెడుతుంది. నిత్యం దేశంలో దాదాపు 1000 మంది కరోనా కాటుకు బలవుతుండడం తీవ్ర ఆం దోళనను కలిగిస్తుంది. ఆదివారం ఉదయం నాటికి మహమ్మారి బారిన పడిన బాధితుల సంఖ్య 26 లక్షలకు చేరువ కాగా, కరోనా కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య 50 వేలకు చేరువులో ఉంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం నాటికి గడిచిన 24 గంటల్లో దేశంలో మరో 63,490 మంది కొవిడ్ బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 25,89,682కు చేరింది. అదే విధంగా ఒక్కరోజే 944 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 49,980కి చేరినట్లు కేంద్ర వైద, ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. భారత్‌లో ఈ నెల 7వ తేదీ నుంచి నిత్యం 60 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే 11తేదీన ఒక్క రోజు మాత్రమే 53,601 కేసులు వచ్చాయి. అయితే 7వ తేదీ నాటికి కొవిడ్ బాధితుల సంఖ్య 20 లక్షలు దాటింది. ఒకవైపు రోజు రోజుకు పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మరోవైపు మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటుంది. ఇప్పటి వరకు 18,62,258 మంది కరోనాను జయించగా, రికవరీ 71.91 శాతంగా ఉంది. ప్రస్తుతం 6,77,444 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవి మొత్తం కేసుల్లో 26.16 శాతంగా ఉన్నాయి. ఇక మరణాల రేటు 1.93 శాతానికి పడిపోయినట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడవ స్థానంలో కొనసాగుతుండగా, మరణాల్లో నాలుగో స్థానంలో ఉంది. దేశంలో వైరస్ ప్రవేశించిన నాటి నుంచి ఈనెల 15 నాటికి మొత్తం 2,93,09,703 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 7,46,608 శాంపిల్స్‌ను పరీక్షించారు.
‘మహా’లో మరణ మృదంగం
మహారాష్ట్రలో మహమ్మారి విజృంభిస్తుండడంతో మరణాల సంఖ్య భారీగా పెరుగుతుంది. రాష్ట్రంలో నిత్యం భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో పాటు మరణాల కూడా పెద్ద సంఖ్యలో సంభవిస్తున్నాయి. నిత్యం 300లకు పైగా మంది మృత్యువాత పడుతున్నారు. శనివారం ఒక్కరోజే మరో 322 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 19,749కి చేరింది. రాష్ట్రం అటు బాధితుల్లోనూ, ఇటు మరణాల్లో మహారాష్ట్ర దేశంలోనే తొలిస్థానంలో కొనసాగుతుంది. మహారాష్ట్రలో కరోనా బారిన పడుతున్న పోలీసుల సంఖ్య గత 24 గంటల్లో మరింత పెరిగింది. కొత్తగా మరో 303 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 12,290 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్ రాగా, 9,850 మంది పూర్తిగా కోలుకున్నారు. 2,315 యాక్టివ్ కేసులు ఉండగా, 125 మంది మృతి చెందారు. తమిళనాడులో గత కొన్ని రోజుల నుంచి నిత్యం వందకు పైగా మంది బాధితులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా మరో 127 మంది ప్రాణాలు కోల్పోగా, మృతుల సంఖ్య 5,641కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 10 మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 4,188గా ఉంది. కర్నాటకలోనూ ఇటీవల కాలంగా వందకుపైగా మరణాలు సంభవిస్తున్నాయి. 24 గంటల్లో మరో 114 మంది చనిపోయారు. తాజాగా మరణాల కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,831 మంది ప్రాణాలు కోల్పోయారు. గజరాత్‌లో మరో 19 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 2,765కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం 88 మంది బలి కాగా, మొత్తంగా 2,650 మరణాలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా 58 మంది, మొత్తంగా 2,393, పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా 58 మంది, మొత్తంగా 2,377, మధ్యప్రదేశ్‌లో తాజాగా 13 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 1,094కు చేరింది.
50 వేల మరణాలు
RELATED ARTICLES