50 కోట్లమంది ఫేస్‌బుక్‌ డేటా లీక్‌

భారత్‌లో 61 లక్షల మంది
వేలానికి సిద్ధం చేసిన ఒక వెబ్‌సైట్‌
న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన 61 లక్షల మంది ఫేస్‌బుక్‌ యూజర్ల వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో హ్యాకర్లకు వేలంపాట వేసేందుకు ఒక వెబ్‌సైట్‌ వేదికపై సిద్ధంగా ఉంచినట్లు సోమవారంనాడు సైబర్‌ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్‌ హెచ్చరించింది. హడ్సన్‌ రాక్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ కు చెందిన ప్రధాన టెక్నికల్‌ ఆఫీసర్‌, ఈ సంస్థ సహ-వ్యవస్థాపకుడు అలోన్‌ గాల్‌ ఈ విషయం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌ బుక్‌ వాడుతున్న 106 దేశాలకు చెందిన 50 కోట్ల 33 లక్షల మంది ఫేస్‌బుక్‌ వినియోగదార్ల వివరాలు వేలం వేసేందుకు ఒక వెట్‌సైట్‌లో సిద్ధంగా ఉంచారని ఆయన పేర్కొన్నారు. ఈ 50.33 కోట్ల మంది ఫేస్‌బుక్‌ యూజర్ల పేర్లు, వారి ఫోన్‌ నెంబర్లు, ఐడి వివరాలు, చిరునామాలు అన్నీ సిద్ధంగా ఒకచోట ఉంచారన్నారు. ఇవన్నీ ఉచిత ప్రాతిపదికపై లీక్‌ అయ్యాయని, అంటే దాని అర్థం ఫేస్‌బుక్‌ యూజర్లకు ఎలాంటి భద్రత లేదని అర్థమని ఈ ఎగ్జిక్యూటివ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆయన తన ట్వీట్‌లో ఆ దేశాల వివరాలు కూడా పేర్కొన్నారు. ఇందులో భారతదేశానికి చెందిన 61 లక్షల మంది ఫేస్‌ బుక్‌ యూజర్ల వివరాలు కూడా ఉన్నాయని ట్వీట్‌లో పేర్కొన్నారు. అమెరికాకు చెందిన మూడుకోట్ల 23 లక్షల మంది యూజ ర్లు, బ్రిటన్‌కు చెందిన కోటీ 15 లక్షల మంది యూజర్ల వివరాలు, ఆస్ట్రేలియాకు చెంది న 70 లక్షల 30 వేల మంది ఫేస్‌ బుక్‌ యూజర్ల వివరాలు ప్రత్యేకించబడిన ఒక వెబ్‌సైట్‌లో హ్యాకర్లకు వేలంపాట వేసేందుకు తస్కరించి సిద్ధంగా ఉంచారని అలోన్‌ గాల్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే దీనిపై ఫేస్‌బుక్‌ను సంప్రదించగా, ఇదం తా గతంలో 2019లో ఏనాడో దొంగిలించి పెట్టి న సమాచారమని, ఇందులో కొత్త విషయం ఏదీ లేదని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. 2020 ఆరంభంలో ఫోన్‌ నెంబర్ల ద్వారా డేటాను పరిశీలించి యూజర్ల ఎఫ్‌బి ఖాతాలను దుర్వినియో గం చేశారని అలోన్‌ అన్నారు. గతంలో కూడా అంటే 2020 డిసెంబరు 31 నాడు ఫేస్‌ బుక్‌ 2.80 బిలియన్ల నెలవారీ యూజర్‌ కార్యకలాపాలకు సంబంధించిన డేటా దొంగిలించారు. 2018 మార్చినెలలో 5.62 లక్షల మంది భారతీయుల ఫేస్‌బుక్‌ డేటాను, 80.70 లక్షలమంది ప్రపంచ యూజర్ల డేటాను బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్‌ అనలిటికా సేకరించిందన్న వార్తలపై కలకలం రేగింది. ఫేస్‌ బుక్‌ యూజర్లలో భారత్‌దే అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. భారత్‌లో 53 కోట్లమంది వాట్సాప్‌ యూజర్లు, 41 కోట్లమంది ఫేస్‌బుక్‌ యూజర్లు, 21 కోట్లమంది ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు ఉన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?