HomeNewsBreaking News5 లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టు

5 లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టు

ఈ ఏడాది చివరినాటికి సృష్టించాలన్నదే లక్ష్యం
కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు మరికొన్ని నెలల్లో నీళ్లు
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణకు సిట్టింగ్‌ జడ్జిని నియమించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిఎం రేవంత్‌రెడ్డి లేఖ
నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
ప్రజాపక్షం / హైదరాబాద్‌ ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 5 లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టును సృష్టించాలనే లక్ష్యంతో తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో వ్యయం చేయబోతోందని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.హైదరాబాద్‌లోని జలసౌధలో నీటి పారుదల శాఖ అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున వృథా, అనుత్పాదక వ్యయాన్ని సమీక్షా సమావేశంలో బహిర్గతం అయిందని తెలిపారు. పర్యవసానంగా, ప్రస్తుత ప్రభుత్వం నీటిపారుదల కింద కొత్త ఆయకట్టును పెంచడంపై దృష్టి సారించి, సరైన వ్యయానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. కొత్త ఆయకట్టును వేగంగా ఉత్పత్తి చేయగల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన అన్నారు. సమావేశంలో ప్రాజెక్ట్లు వ్యయం గురించి చర్చించామని 6 నెలల్లో , సంవత్సరంలోపు కొత్త ఆయకట్టు వచ్చే ప్రాజెక్టులను గుర్తించామన్నారు. ఆరు నెలల్లో ఈ లక్ష్యాన్ని సాధించే ప్రాజెక్ట్లపై ఖర్చును పెంచాలనే నిర్ణయంతో కొత్త ఆయకట్టు సృష్టికి కృషి చేస్తున్నామని , డిసెంబర్‌ 2024 నాటికి 4.5 నుండి 5 లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టులను సృష్టించడమా తమ లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలిన ఘటనపై విజిలెన్స్‌ విచారణ ప్రారంభించిన విషయాన్ని ప్రస్తావించగా, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఉత్తమ్‌ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణకు సిట్టింగ్‌ జడ్జిని నియమించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాసినట్టు వెల్లడించారు. కృష్ణా, గోదావరి బేసిన్‌ లలో సుమారు 18 ప్రాజెక్టులలో పలు ప్యాకేజల కింద ఈ ఏడాది చివర నాటికి నీరందిసామన్నారు.రాబోయే 5 ఏళ్లలో ఏ ప్రాజెక్టులలో కొత్త ఆయకట్టు ఎంత ఇస్తున్నామో సమాచారం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త ఆయకట్టుకు నీరు ఇచ్చే విషయంలో ఉన్న ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించనట్లు తెలిపారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంథని నియోజక వర్గానికి నీరందించే పనులు చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు కోయిన సాగర్‌ ప్రాజెక్టు నుంచి వంద టిఎంసిల నీరు మనకు ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు. మహారాష్ర్ట కు ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే విద్యుత్‌ ఉత్పత్తి కి సంబంధించిన వ్యయం అందిస్తామని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. నీటి హక్కుల సమస్యను ప్రస్తావిస్తూ, తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు రాష్ర్ట ప్రభుత్వ నిబద్ధతతో ఉందని అన్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి జాతీయ ప్రాజెక్టుహోదా కల్పించాలని కోరుతూ ఇటీవల ముఖ్యమంత్రితో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను కలిశామన్నారు. జాతీయ ప్రాజెక్టు హోదా కోసం నిర్దిష్ట పథకం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేసినా, నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని ఉత్తమ్‌ వివరించారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద పాలమూరు రంగారెడ్డి నిధులు ఇస్తామని గజేంద్ర సింగ్‌ షెకావత్‌ హామీ మేరకు ప్రాజెక్టు నిధుల కోసం ఈ వారంలో భారత ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతామని ఆయన తెలిపారు.అంబేడ్కర్‌ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరావును విమర్శించారు. అసలు ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ఖర్చులో నాలుగో వంతుతో 16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును వచ్చేదన్నారు. సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో కెసిఆర్‌ చేసిన తప్పిదాలపై ఆయన విచారం వ్యక్తం చేస్తూ, తెలంగాణ ప్రజలు తరతరాలుగా దుష్పరిణామాలను చవిచూడాల్సి వస్తోందన్నారు. సరైన ఖర్చుతో త్వరితగతిన కొత్త ఆయకట్టులను సృష్టించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పునరుద్ఘాటించారు. వేసవిలో తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా ఉన్న అన్ని నీటి చెరువులను పూడిక తీసి జంగిల్‌ క్లియర్‌ చేసే పనులు చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రస్తుత నీటి కొరత దృష్ట్యా, రాబోయే తాగునీటి అవసరాలను తీర్చడానికి 10 టిఎంసిల కృష్ణా నీటిని కోరేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బందం కర్ణాటకలో పర్యటించనుందని ఆయన వివరించారు. సమీక్షా స మావేశంలోఇఎన్‌సి మురళీధర్‌ రావు ,ఇఎన్సీలు, సిఒలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments