HomeNewsBreaking News5జి ఫోన్‌ సేవల ఎఫెక్ట్‌!

5జి ఫోన్‌ సేవల ఎఫెక్ట్‌!

అమెరికాకు భారత్‌ సహా పలు దేశాల విమానాల రద్దు
వేలాది ప్రయాణికులకు అంతరాయం
న్యూఢిల్లీ : అమెరికాలో 5 ఫోన్‌ సర్వీసులు ప్రారంభం కావడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు దేశాలు అమెరికాకు విమాన సర్వీసులను నిలిపివేశాయి. దీంతో వేలాదిమంది విమాన ప్రయాణికులు ఎక్కడివారు అక్కడే నిలిచిపోయారు. వారి ప్రయాణాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. 5 సేవలు ప్రారంభం కావడంవల్ల ఆ ఫోన్‌ తరంగాలు విమానాలలో యాంత్రిక లోపాలను సృష్టిస్తాయని, కొన్ని సెన్సర్‌లను పనిచేయనీయకుండా అడ్డుపడతాయని పేర్కొనడంతో విమాన సేవలకు తీవ్ర విఘాతం కలిగింది. 5 సేవలు నిర్ణీత ప్రకారం బుధవారం ప్రారం భం అవుతాయి. ఎయిర్‌ ఇండియాతో సహా అనేక అంతర్జాతీయ ఎయిర్‌ లైన్స్‌ తమ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. 5 ఫోన్‌ వల్ల వచ్చే తరంగాలు విమానాలలో ఉన్న నేవిగేషన్‌ వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తాయి. విమానాన్ని రన్‌వే పై నిలబెట్టేందుకు ఎలాంటి అవకాశం ఉండదు. సి సర్వీస్‌ల ద్వారా శరవేగంగా తరంగాలు కదులుతాయి. 5 విస్తారమైన కవరేజీ ఉంటుంది. కానీ అదే సమయంలో దాని ఉధృతి మిగిలిన సాంకేతిక విభాగాల పనితీరుపై కూడా ప్రభా వం చూపిస్తాయి. ఈ విషయంలో బుధవారంనాడు ఎయిర్‌ ఇండియా ఒక ట్వీట్‌ చేస్తూ, అమెరికాలో 5 కమ్యూనికేషన్స్‌ ప్రారంభం కార్యకలాపాలవల్ల తాము విమానాలను నడపలేమని పేర్కొంది. జనవరి 19వ తేదీ నుండి విమానాలను నడపలేమని తెలిపింది. ఈ సేవలను నిలిపివేయడం లేదా రాకపోకలనుసవరించడం, మార్పులు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ సర్వీసులు, ఢిల్లీ ఢిల్లీ ముంబయి రహదారుల్లో విమానాల రాకపోకలను నడిపించలేమని ఎయిర్‌ ఇండియా మరో ట్వీట్‌లో తెలియజేసింది. ఎయిర్‌ ఇండియాతోపాటు అనేక దేశాలు కూడా తమ విమానాలను అమెరికాకు నడిపించకుండా నిలిపివేశాయి. దీంతో వేలాదిమంది ప్రయాణికులు ఎక్కడివారు అక్కడే నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమిరేట్స్‌ విమానాలను కూడా నిలిపివేసింది. బోట్సన్‌, చికాగో, డల్లాస్‌, ఫోర్ట్‌ వర్త్‌, హ్యూస్టన్‌, మియామి, న్యూయార్క్‌, ఓర్లాండో, శాన్‌ఫ్రాన్సిస్కో, సీటెల్‌ లకు విమానాలను నడపడం లేదని ఎమిరేట్స్‌ ప్రకటించింది. అయితే డెల్లా ఎయిర్‌ లైన్స్‌ ఒక ప్రకటన చేస్తూ, అమెరికా విమానాశ్రయాల్లో 5 అమలును జాప్యం చేస్తామని ప్రకటించడం శుభపరిణామమని పేర్కొంది. ఇది కొంత సానుకూల పరిణామమని తెలిపింది. కాగా 5 కంపెనీలు ఎటి అండ్‌ టి మంగళవారం ఒక ప్రకటన చేస్తూ, కొన్ని విమానాశ్రయాల్లో తాము 5 ని యాక్టివేట్‌ చేయడాన్ని జాప్యం చేస్తున్నాయని ప్రకటించాయి. వేలమంది ప్రయాణికుల ఆశలు 5 ఆటంకంవల్ల ఆడియాసలయ్యాయి. నాలుగేళ్ళ తరువాత భారత్‌కు బయలు దేరిన ఒక కుటుంబం తీవ్ర నిరాశకు గురైంది. తాము ఇప్పటివరకూ కరోనా సమస్య ఎదుర్కొన్నామని, ఇప్పుడు ఈ కొత్త సమస్య వచ్చిపడిందని వాపోయారు. తమ ప్రయాణం ఇప్పుడు అనిశ్చితంగా మారిపోయిందని న్యూయార్క్‌లో భారత్‌ విమానం కోసం ఎదురుచూస్తున్న జయంతిరాజ్‌, వారి కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. మరో ప్రయాణికురాలు ప్రియాంకా సేథ్‌ మాట్లాడుతూ, విమానాల రద్దు వల్ల తాను ముంబయికి వెళ్ళాల్సిన అత్యవసరమైన పని ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఇప్పటికే 72 గంటలకోసం ఆర్‌టి కరోనా పరీక్ష చేయించుకుని సిద్ధంగా ఉన్నామని వాపోయారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. వారు ఒంటరిగా భారత్‌కు ప్రయాణం చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు వారి పరిస్థితి కష్టాల్లో పడింది. చిన్న పిల్లలతో మా ప్రయాణం ఎంతో కష్టం, మేం మళ్ళీ వెనక్కి వెళ్ళడం, ఇక్కడ మళ్ళీ ఏర్పాటు చేసుకోవడం ఎంతో కష్టమైన పని అని ఆమె తీవ్ర నిరాశ, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments