న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఓ ప్రైవేట్ సంస్థకు బొగ్గు బ్లాకులను అక్రమంగా కేటాయించిన బొగ్గు కుంభకోణం కేసులో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సి గుప్తా, తదితరులకు డిసెంబర్ 5న శిక్ష తీర్పును ప్రకటించనున్నట్లు ఢిల్లీ కోర్టు సోమవారం తెలిపింది. కోర్టు నవంబర్ 30న గుప్తాను, బొగ్గు మంత్రిత్వశాఖ మాజీ సంయుక్త కార్యదర్శి కెఎస్ క్రోఫ, మంత్రిత్వ శాఖలోని నాటి డైరెక్టర్(కెఎ-ఐ) కెసి సమరియాలను దోషులుగా తేల్చింది. వికాస్ మెటల్స్ అండ్ పవర్ లిమిటెడ్ సంస్థను, దాని మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ పాట్నీని, సంతకంచేసిన ఆనంద్ మలిక్‌లను కూడా కోర్టు దోషులుగా తేల్చింది. స్పెషల్ జడ్జి భరత్ పరాశర్ సోమవారం విచారణను ముగించారు. ఐదుగురు దోషులకు కనీసం ఏడేళ్ల జైలుశిక్ష, ప్రైవేట్ సంస్థపై భారీ జరిమాన విధించాలని సిబిఐ కోర్టును కోరింది. గుప్తా తరఫు న్యాయవాదులు తమ క్లయింట్ 70 ఏళ్ల వృద్ధుడని, వివిధ జబ్బులతో బాధపడుతున్నాడని, ఆయన తన కుటుంబాన్ని పోషించుకోడానికి కేవలం పింఛనుపైనే ఆధారపడ్డాడని వాదించారు. వీలయినంత తక్కువ శిక్షను విధించాలని వేడుకున్నారు.
5న బొగ్గు కుంభకోణం తీర్పు
RELATED ARTICLES