మున్సిపల్ ఎన్నికల బరిలో 19,673 మంది అభ్యర్థులు
ప్రజాపక్షం/హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం పోటీలో ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. నామినేషన్ల పరిశీలనలో 432 నామినేషన్లను తిరస్కరించింది. రాష్ట్ర వ్యాపితంగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పోరేషన్ల పరిధిలోని మొత్తం 3052 వార్డులకు గాను టిఆర్‌ఎస్ 8956, కాంగ్రెస్ 5365, బిజెపి 4179, టిడిపి 433, సిపిఐ 269, సిపిఐ(ఎం) 268, ఎంఐఎం 441, గుర్తింపు పొందిన పార్టీలు 385 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఇందులో ఇండిపెండెంట్‌గా 4889 మంది బరిలో నిలబడ్డారు. మొత్తంగా 25,768 నామినేషన్లను దాఖలు కాగా నామినేషన్ దరఖాస్తులను పరిశీలించిన ఎన్నికల సంఘం 432 దరఖాస్తులను తిరస్కరించింది. దీంతో మొత్తం అభ్యర్థులు 19,673 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా,25,336 నామినేషన్లను ఉన్నా యి. ఇదిలా ఉండగా రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నామినేషన్ల జాబితాలో కొన్ని మున్సిపాలిటీలలో ఉన్న వార్డుల సంఖ్య కంటే నామినేషన్ల సంఖ్య చాలా తక్కువగా నమోదైంది. అయితే కొన్ని మున్సిపాలిటీల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం రాలేదని, తమకు అందిన సమాచారం మేరకు జాబితాను విడుదల చేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార వర్గాలు తెలిపాయి.