మితిమీరుతున్న విడిసి పెద్దల ఆగడాలు
ప్రజాపక్షం / నిర్మల్ నిర్మల్ జిల్లాలో విడిసి (గ్రామ అభివృద్ధి కమిటీ)ల ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. అభివృద్ధి పేరిట ఇసుక, మద్యం, శీతాలపానియాలు, మాంసాహార దుకానాలకు టెండర్లు వేస్తూ గ్రామాలపై ఆజామయిషీ చేస్తున్నాయి. అయితే మామడ మండంలోని న్యూ సాంగ్వి గ్రామంలో ఏకంగా ఓ సామాజికి వర్గానికి చెందిన 410 కుటుంబాలను గ్రామం నుండి విడిసి పెద్దలు బహిష్కరించారు. గత 80 సంవత్సరాలుగా గ్రామంలో నివశిస్తున్న తమపై న్యూ సాంగ్వి విడిసి చైర్మన్ వికాస్‌రెడ్డి, గ్రామ పెద్ద లింగారెడ్డి కక్ష పూరితంగా వ్యవహరించి గ్రామం నుండి బహిష్కరణ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు ఎవరైనా సహకరించినా, రేషన్ దుకాణదారుడు తమకు రేషన్ ఇచ్చినా రూ. 5000 జరిమానా విధిస్తామని, ఎవైరనా సహాయం చేసినట్లు చూసి చెబితే వారికి రూ. 1000 రూపాయల నజరానా ఇస్తామని విడిసి సభ్యులు గ్రామంలో దండోరా వేయించారన్నారు. కిరాణా షాపుల్లో, సరకులు, రేషన్ బియ్యం, సరకులు ఇవ్వకుండా కట్టుబాట్లు విధించారని వాపోయారు. తమ మేకలు, గొర్రెలు, బర్రెలు గ్రామంలోకి రానివ్వ వద్దని ఆంక్షలు విధించారని చెప్పారు. అధికారులు స్పందించి విడిసి వ్యవస్థను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.
410 కుటుంబాలు గ్రామ బహిష్కరణ
RELATED ARTICLES