భారత్‌లో కరోనా కరాళ నృత్యం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భారత్ లో కరళా నృత్యం చేస్తోంది. రోజుకు మించి రోజు కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వరుసగా 8వ రోజు కూడా 10 వేలకు పైగా మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం కేసులు నాలు గు లక్షలు దాటాయి. మృతుల సంఖ్య కూడా 13 వేలు దాటింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 24 గంటల్లోనే రికార్డుస్థాలో 14,516 మందికి కరోనా సోకింది. ఒక్క రోజు వ్యవధిలో రికార్డు అయిన కేసుల్లో ఇదే అత్యధికం. అయితే సాయంత్రం నాటికి భారత్‌లో మొత్తం 4,00,724 మందికి మహమ్మా రి సోకింది. జూన్ 1 నుంచి 20వ తేదీ వరకు రెండు లక్షలకు పైగా మంది కరోనా బారిన పడ్డారు. బాధితల సంఖ్య పెరుగుతున్న మొదటి ఐదు రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లు ఉన్నాయి. మరో వైపు దేశంలో మరణాల సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. రోజుకు 300లకు పైగా మంది మృత్యువాత పడుతున్నారు. 24 గంటల్లో మరో 375 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 13,035కు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. అయితే కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడం కొంత ఊరట కలిగిస్తుంది. శనివారం ఉదయం నాటికి దేశంలో 1,68,269 యాక్టివ్ కేసులు ఉండగా, 2,13,830 మంది వైరస్ నుం చి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 54.13గా ఉన్నట్లు మంత్రిత్వశాఖకు చెందిన ఒక అధికారి చెప్పారు. ప్రపంచంలో కరోనా మరణాల సంఖ్య ఎ క్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో కొ నసాగుతుండగా, పాజిటివ్ కేసుల సంఖ్యలో మాత్రం భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. రోజువారీగా చూస్తే, అమెరికా, బ్రెజిల్, భారత్‌లలోనే నిత్యం అధిక పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
మహారాష్ట్రలో విజృంభణ : కరోనా మరణ మృదంగం మోగిస్తుం ది. రాష్ట్రంలో కొత్తగా 142 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 5,893 మంది కరనా వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. బాధితుల సంఖ్య కూడా ఈ రాష్ట్రంలోనే అధికంగా ఉంది. మొత్తం 1,24,331 కేసులో దేశంలోనే తొలి స్థానంలో కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. శుక్రవారం ఒక్క రోజే 66 మంది మృతి చెందారు. మరణాల సంఖ్యలో ఢిల్లీ దేశంలో రెండవ స్థానంలో ఉండగా, కేసుల సంఖ్యలో మూడవ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 2,035 మంది చనిపోగా, 53,116 కేసులు నమోదయ్యాయి. అటు తమిళనాడులోనూ కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 54,449 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 41 మంది మరణించారు. మొత్త మృతుల సంఖ్య 666కు చేరింది. అ యితే కేసుల సంఖ్యలో రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇక గుజరాత్‌లోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 26,141 ఉండగా, ఇప్పటి వరకు 1,618 మంది కరోనా కాటుకు బలయ్యారు. మరణాల సంఖ్యలో రాష్ట్రం దేశంలోనే మూడవ స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లో 15,785 కేసులు నమోదు కాగా, 488 మంది మరణించారు. అయితే రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్‌లోనూ పది నుంచి 15 వేల వరకు కేసులు నమోదయ్యాయి.
4 లక్షల కేసులు13,000 మృతులు
RELATED ARTICLES