మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ప్రజాపక్షం / హైదరాబాద్
అంకిత భావంతో సృజనాత్మకంగా తీసిన ఒక ఫొటో కొన్ని పేజీల వార్తా సారాంశాన్ని అర్థవంతంగా తెలియజేసి పాఠకులను ఆలోచింప చేస్తుందని సమాచార పౌర సంబంధాలు, రెవె న్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం అంతర్జాతీయ ఫొటో గ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన వరల్డ్ ఫొటోగ్రఫీ డే వేడుక ల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని రాష్ట్ర మీడి యా అకాడమీ చైర్మన్ కె. కలిసి ఫొటోగ్రఫీ ప్రదర్శనను ప్రారంభించారు. ప్రతి రోజు దినపత్రికలు చదవటం అలవాటని, అన్ని వార్తలు చదవక పోయినా, అన్ని పేజీలలోని ఫొటోలను చూసి, ఆ వార్తలోని అంశాన్ని అర్థం చేసుకుంటానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభయహస్తం హామీలపై నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీలకు వచ్చిన ఫొటో ఎంట్రీలను ఇక్కడ ప్రదర్శించారు. 5 కేటగిరీలలో జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన ఫొటోలను తీసిన ఫోటోగ్రాఫర్లుకు మేమెంటో, శాలువా, నగదు పు రస్కారాలను ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డిలు అందజేసి వారిని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఫోటోకు జీవం పోసేందుకు ఫోటోగ్రాఫర్లు అంకితభావంతో కష్టపడతారని ప్రశంసించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో అభయహస్తం అమలుకు గాను గత 8 నెలలుగా అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి నేటి ఫోటోగ్రఫీ ప్రదర్శన చక్కటి నిదర్శనంగా నిలుస్తోందని చెప్పారు. మీడియా ఫోటోగ్రాఫర్ల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని హామీ ఇచ్చారు. సంక్షేమం, అభివృద్ది రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఫోటోలతో వార్తకు పరిపూర్ణత: కె.శ్రీనివాస్‌రెడ్డి
గౌరవ అతిథిగా హాజరైన రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ల కృషి చాలా గొప్పదని.. ఫోటో పేపరే లేదని అన్నారు. ఫోటోగ్రాఫర్ల యాక్షన్ ఫోటో చాలా ముఖ్యమైనది ఉంటుందన్నారు. తక్షణం ఆలోచన కల్గించే ఫోటోలు.. ఆ ఫోటోతో కూడిన వార్తకు పరిపూర్ణత చేకూరుతుందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో అనేక ఆటుపోట్లు, ఇబ్బందులను భరించి వారి లక్ష్యం చేరే వరకు కూడా ఫొటోగ్రాఫర్లు పనిచేస్తారని చెప్పారు. మీడియా ఫోటోగ్రాఫర్లను రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. గత ప్రభుత్వం వరల్డ్ ఫోటోగ్రఫీ డేను తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వలర్డ్ ఫోటోగ్రఫీ డేకు ఎంతగానో ప్రాధాన్యతను ఇచ్చి మీడియా ఫోటోగ్రాఫర్లను ఈ రోజు గౌరవించుకోవడం అభినందనీయమని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అనంతరం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమీషనర్ యం. హనుమంతరావు మాట్లాడుతూ..5 కేటగిరీలలో నిర్వహించిన అంతర్జాతీయ ఫోటోగ్రఫీ డే పోటీలలో 101 మంది 990 ఫోటోలను తమకు పంపించారని, దీంతో ఫోటోగ్రఫీ, జర్నలిజంలలో నిష్ణాతులైన న్యాయ నిర్ణేతలు ఆధ్వర్యంలో ఒక జ్యూరిని నియమించి వారి ద్వారా ఆయా ఫోటోల ఎంపిక కోసం ప్రతి కేటగిరీలో మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు, 5 కన్సోలేషన్ బహుమతులకు ఫోటోలను ఎంపిక జేసినట్లు తెలిపారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన వరల్డ్ ఫోటోగ్రఫీ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఫోటోగ్రాఫర్లు ఆదిలాబాద్, ఖమ్మం, నారాయణపేట తదితర సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులతో హాజరు కావడం నిజంగా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్లు డి ఎస్ జగన్, డి శ్రీనివాస్, కే వెంకట రమణ, సిఐఈ రాధా కిషన్ , మీడియా అకాడమీ సెక్రెటరీ ఎన్ వెంకశ్వరరావు,ఎఫ్‌డీసి ఈడి కిషోర్ బాబు ఇతర అధికారులు, శాఖ ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.
ఫొటోతో వార్తకు జీవం
RELATED ARTICLES