HomeNewsLatest Newsకఠినంగా శిక్షించాల్సిందే...

కఠినంగా శిక్షించాల్సిందే…

కోల్‌కతా డాక్టర్‌ అత్యాచార ఘటనపై ప్రజాసంఘాల డిమాండ్‌ 

ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన

ప్రజాపక్షం/హైదరాబాద్‌
కోల్‌కతాలోని ఆర్‌జి మెడికల్‌ కళాశాల జూనియర్‌ డాక్టర్‌పై అత్యాచారానికి పాల్పడి, అతి కిరాతకంగా హతమార్చిన దోషులను తక్షణమే కఠినంగా శిక్షించాలని పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం,కేంద్రప్రభుత్వాన్ని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. జూనియర్‌ డాక్టర్‌పై అత్యాచారం, హత్యను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, తెలంగాణ వ్యవసా య కార్మిక సంఘం, తెలంగాణ రాష్ట్ర మహిళా సమాఖ్య, తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య, ఎఐటియుసి, అఖిల భారత యువజన సమాఖ్య, అఖిల భారత విద్యార్థి సమాఖ్య,టూరిజంఅభివృద్ది సంస్థ కాంట్రాక్టర్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ తదితర సంఘాల ఆధర్వంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహాం వద్ద సోమవారం కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగాతెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ మాట్లాడుతూ అక్కాచెళ్లలు, అన్నాదమ్ముల మధ్య రాకీ బంధం ఏలా ఉంటుందో, సమాజంలో ప్రజల మధ్య కూడా ఇదే అనుబంధం కొనసాగాలి తప్ప, ఈ ఆధునిక యుగంలో కిరాతకమైన సంఘటనలు చోటు చేసుకోవ చాలా బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగాఅన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న వైద్యులు, నర్సులు ఇతర సిబ్బందికిపూర్తి భద్రత కల్పించేందుకు జాతీయ స్థాయిలో పటిష్టమైన భద్రతా చట్టాన్ని ప్రవేశపెట్టాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌. బాలమల్లేష్‌ మాట్లాడుతూ మహిళలపై జరగుతున్న లైంగిక దాడులను వ్యవసాయ సంఘం తీవ్రంగా ఖండిస్తోందని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటాలను మరింత ఉదృత్తం చేస్తామని అన్నారు. మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.జ్యోతి మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళల రక్షణకు ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకువచ్చామని చెబుతున్నప్పటికీ వాటిని పటిష్టంగా అమలు చేయకపోవడంతోనే దేశ వ్యాప్తంగా రోజు రోజుకూ మహిళలపై మరిన్ని లైంగిక దాడులు జరుగుతున్నాయని అన్నారు. వీటన్నింటిని సమగ్రంగా అరికట్టాలంటే బలమైన చట్టాలను తీసుకురావడంతో పాటు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ద్వారా 10 నుంచి 15 రోజుల లోపే విచారణ పూర్తిచేసి, దోషులను కఠిన శిక్షలు విధిస్తే తప్ప ఈ దాడులు అగబోవని చెప్పారు. గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్యనాయక్‌ మాట్లాడుతూ ఎంతో మంది నిరుపేద తల్లిదండ్రులు తమ పిల్లలను కష్టపడి చదివించి డాక్టర్లుగా చూడాలని వారి ఆశలను కొంతమంది దుర్మార్గులు ఆదిలో తుంచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతూ అత్యంత పాశవికంగా హత్య చేయడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఎఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు శ్రీకాంత్‌ మాట్లాడుతూ చట్టాలు ఉన్నవారికి చుట్టాలుగా మారడం కారణంగానే సమాజంలో మహిళలపై దాడులు పెరగడానికి కారణమవుతున్నాయన్నారు. ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌ మాట్లాడుతూ కోల్‌కతా ఘటనపై సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపి. నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఎఐటియుసి నాయకురాలు విజయలక్ష్మిపండిత్‌ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు హత్యలు చూస్తుంటే మనం ఆధునిక సమాజంలో ఉన్నామా, లేదా అటవిక సమాజంలో ఉన్నామా అని ఆవేదన వ్యక్తం చేశారు. టూరిజం అభివృద్ది సంస్థ కాంట్రాక్టర్స్‌ యూనియన్‌ నాయకులు రాజమౌళి మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు ఎన్ని సార్లు అధికారంలో వచ్చినా ఏమి ఉపయోగమని,వారు ఉన్నా లేకున్న ఒక్కటేనని అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు ప్రభులింగం, వ్యవసాయసంఘం రాష్ట్ర అధ్యక్షులు కాంతయ్య మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకురాలు జె.లక్ష్మితో పాలు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments