చర్యల్లో బయటపడుతున్న మరిన్ని మృతదేహాలు
రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న మిలటరీ, భద్రత బలగాలు
ప్రతిపాదికన సహాయ చర్యలు కొనసాగిస్తున్న ఆర్మీ
ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన జోకో విడోడో
కరిటా(ఇండోనేషియా): ఇండోనేషియాలో శనివారం సంభంవించిన సునామీ విపత్తు మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. సోమవారం సాయంత్రం నాటికి విపత్తు కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 373కి చేరుకుంది. ప్రస్తుతం సునామీతో ప్రభావితమైన పశ్చిమ జావా, దక్షిణ సుమిత్రా తీర ప్రాంతాల్లో అధికారులు యుద్ద ప్రాతిపదికన సహాయ చర్యలను కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో సహాయక బృందాలు శిధిలాలను తొలగించేందుకు నిరంతరం శ్రమిస్తున్నాయి. సునామీతో ప్రభావితమైన సుందా స్ట్రుటై ప్రాంతంలో సహాయ చర్యల కోసం అధికారులు భారీ పరికరాలను ఉపయోగిస్తున్నారు. మరింత కొంత మంది సిబ్బంది ఒట్టి చేతులతోనే శిధిలాలను తొలగిస్తూ రెస్కూ ఆపరేషన్ కొనసాగుతున్నారు. ప్రభుత్వ సూచన మేరకు ఇప్పటికే ఇక్కడి నుంచి చాలా మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు. సునామీ తీవ్రత ఎక్కువగా ఉండడంతో.. పశ్చిమ జావా, దక్షిణ సుమిత్రా తీర ప్రాంతంలోని బీచ్లో గల హోటళ్లన్నీ నీటిలో మునిగిపోయి తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా వరకు బీచ్లో గల హోటళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. అనేక హోటళ్లు బురదతో నిండిపోయాయి. ఇండోనేషియా విపత్తు సంస్థ అధికార ప్రతినిధి సుటోపో పుర్వో నూగ్రోహో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 14 వందల మందికి పైగా సునామీ విపత్తు వల్ల గాయపడి ఉంటారని పేర్కొన్నారు. అంతేకాక మృతుల సంఖ్యల కూడా పెరుగవచ్చని తెలిపారు. ఇక జావా పశ్చిమ ప్రాంతంలో సునామీ తీవ్రతకు వేలాది భవంతులు నేలకూలిపోయాయి.