ఎన్‌పిఎస్‌
ఆర్థికమంత్రి సీతారామన్‌ స్పష్టీకరణ
జైపూర్‌ :
కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన జాతీయ పెన్షన్‌ పథకం (ఎన్‌పిఎస్‌) కింద జమ అయిన నిధులను రాష్ట్రాలకు బదిలీ చేసే ప్రశ్నేలేదని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ స్పష్టం చేశారు. ప్రస్తుత చట్టాల ప్రకారం ఈ నిధులు రాష్ట్రాలకు బదిలీ అయ్యే అవకాశం లేదని ఆమె సోమవారం వివరణ ఇచ్చారు. జైపూర్‌లో బడ్జెట్‌ అనంతరం పరిణామాలపై పలువురితో చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ సోమవారం పాత్రికేయులతో మాట్లాడారు. నిర్మలాసీతారామన్‌తోపాటు కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి వివేక్‌ జోషి కూడా మాట్లాడుతూ,
ఎన్‌సిఎస్‌ కింద జమ చేసిన నిధులు కేంద్రం నుండి తిరిగి రాష్ట్రాలకు బదిలీ అవుతాయని రాష్ట్రాల ప్రభుత్వాలు భావించినట్లయితే తప్పు కాగలదని, ప్రస్తుత చట్టాలు ఈ బదిలీని అంగీకరించబోవని అన్నారు. రాష్ట్రాలకు ఈ నిధులు ఇవ్వడం అసాధ్యమని అన్నారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఇటీవల గౌతమ్‌ అదానీ గ్రూపు కంపెనీ షేర్లు పతనమైన విషయాన్ని ప్రస్తావిస్తూ, నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ నిధుల పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం షేర్‌ మార్కెట్‌ దయాదాక్షిణ్యాలకు వదిలిపెట్టే ప్రశ్నేలేదని ప్రకటన చేశారు. ఈ పూర్వరంగంలో అందుకు సమాధానంగా నిర్మలాసీతారామన్‌, వివేక్‌ జోషి చ్రేసిన పకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఎన్‌పిఎస్‌ కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రానికి ఇచ్చిన నిధులను తిరిగి ఇవ్వాలని అశోక్‌ గెహ్లాట్‌ లేకపోతే సు్రప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు. అయితే అలాంటి ఆశలు పెట్టుకోవద్దని నిర్మలా సీతారామన్‌ సోమవారం మరోసారి స్పష్టం చేశారు. చాలా రాష్ట్రాలు ఇప్పటికే పాత పెన్షన్‌ విధానం అమలు చేస్తున్నాయి. అయితే పాత పెన్షన్‌ విధానం అమలు సరైన చర్యకాదని, ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రి అంటున్నారు. “ఆపిఎఫ్‌ఓతోపాటు డిపాజిట్‌ చేసిన ఈ నిధులను దాంతోపాటే ఇస్తామని ఒకరాష్ట్రం గనుక ఈ ఎన్‌పిఎస్‌ నిధుల కోసం ఆశపడితే అందరికీ ఇవ్వాలని, ప్రస్తుత చట్టం కింద ఇది సాధ్యం కాదని అందువల్ల అలాంటి ఆశలు పెట్టుకోవద్దని మంత్రి నిర్మల అన్నారు. ఈ డిపాజిట్‌ మనీకింద వడ్డీ జమ అవుతూ ఉంటుందని, ఈ డబ్బు ఉద్యోగి పదవీ విరమణ తరువాత మాత్రమే వారి చేతుల్లోకి వస్తుందని అన్నారు. డిపాజిట్‌ చేసిన ఈ నిధులు ప్రభుత్వం చేతుల్లోకి రావడం అసాధ్యమైన విషయమని అన్నారు. కొన్ని రాష్ట్రాలు పాత పెన్షన్‌ విధానం అమలు చేస్తున్నాయని, ఇది ఆరోగ్యకరమైన విధానం కాదని జోషి అన్నారు.
ద్రవ్యోల్బణ అదుపు చర్యలు తీసుకుంటున్నాం
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ జైపూర్‌లో పాత్రికేయులకు చెప్పారు. ప్రభుత్వం తన దృష్టి అంతా ద్రవ్యోల్బణంపైనే పెట్టిందని, అదుపు చేయడం కోసం వివిధ రకాల మారాలు అవలంబిస్తోందని చెప్పారు. పప్పుధాన్యాలను ప్రభుత్వం ఎక్కువగా దిగుమతి చేసుకుంటోందని, అందువల్ల రైతులు ఈ పప్పుధాన్యాలను పండించేవిధంగా వారిని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తులు గణనీయంగా పెరిగేందుకు పలు మార్గాలు అనుసరిస్తున్నామన్నారు. అదేవిధంగా పప్పుధాన్యాలపై దిగుమతి సుంకాన్ని కూడా తగ్గిస్తున్నామని, స్థానికంగా ఉన్న ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నామన్నారు. 2023 బడ్జెట్‌లో ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలనే లక్ష్యం పెట్టుకున్నామని చెప్పారు. సల్పకాలిక చర్యల్లో భాగంగా మనం ఎక్కడి నుండి వీటిని దిగుమతి చేసుకుంటున్నాగానీ అది కందిపప్పు అయినా, పెసరపప్పు అయినాగానీ వాటిపై దిగుమతి సుంకాలను తగ్గిస్తున్నామని చెప్పారు. కొన్ని సందర్భాల్లో దిగుమతి సుంకం పూర్తిగా తీసేస్తున్నామన్నారు. అదేవిధంగా వంట నూనెల విషయంలో దాదాపు పన్ను లేదని, ఉచితంవగా ఈ దిగుమతులు జరుగుతున్నాయని అన్నారు. ఈ విషయంలో మూడేళ్ళుగా ఇదే విధానం అమలు చేస్తున్నామని అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments