టీమిండియాపై బంగ్లాదేశ్ విజయం
ఢాకా: బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా పరాజయాల పరంపర కొనసాగుతోంది. బుధవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన రెండో వన్డే లో టీమిండియా 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దాంతో మూడు వన్డేల సిరీస్‌ను 0- మ రో మ్యాచ్ మిగిలుండగానే బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. విజయం కోసం చివర్లో రోహిత్ శర్మ(28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51 నాటౌట్) పో రాడినా ఫలితం లేకపోయింది. సిరాజ్ చెత్త బ్యా టింగ్ టీమిండియా కొంపముంచింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 271 పరుగులు చేసింది.మెహ్‌దీ హసన్(83 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 నాటౌట్) విరోచిత సెంచరీతో చెలరేగగా.. మహ్మదుల్లా(96 బంతుల్లో 7 ఫోర్లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు. 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును ఈ జోడీ 148 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకుంది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూ డు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్ల లో 9 వికెట్లకు 266 పరుగులు చేసి ఓటమిపాలైం ది. శ్రేయస్ అయ్యర్(102 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82), అక్షర్ పటేల్(56 బంతుల్లో 2 ఫో ర్లు, 3 సిక్స్‌లతో 56) అర్థ సెంచరీలతో రాణించగా.. చివర్లో రోహిత్ శర్మ పోరాడినా విజయం ద క్కలేదు. పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. రో హిత్ శర్మకు బదులు ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ(5) ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎబాదత్ హోస్సెన్ వేసిన ఈ ఓవర్‌లో పుల్ షాట్ ఆడబోయి కోహ్లీ మూల్యం చెల్లించుకున్నాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన మరుసటి ఓవర్‌లో శిఖర్ ధావన్(8) ఔటవ్వగా.. వాషింగ్టన్ సుందర్‌ను అప్‌ది ఆర్డర్ ప్రమోట్ చేస్తూ టీమ్‌మేనేజ్‌మెంట్ బ్యాటింగ్‌కు పంపించింది. కానీ ఈ ప్లాన్ కూడా వర్కౌట్ కాలేదు. క్రీజులో సెట్ అయినట్లు కనిపించిన సుందర్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి 39 పరుగులు మాత్రమే చేసింది.క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్‌తో కలిసి శ్రేయస్ అయ్యర్ ఇన్నిం గ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ సెంచరీ హీరో మెహ్‌దీ హసన్ .. రాహుల్(14)ను ఎల్బీగా పెవిలియన్ చేర్చి దెబ్బకొట్టాడు. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్‌తో శ్రేయస్ అ య్యర్ జట్టును ఆదుకున్నాడు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముందుగా శ్రేయస్ అయ్యర్ 69 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. తర్వాత 50 బంతుల్లో అక్షర్ అర్థం శతకం అందుకున్నాడు. క్రీజులో సె ట్ అయిన ఈ జోడీని మెహ్‌దీ హసన్ విడదీసాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న శ్రేయస్ అయ్యర్‌ను క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 107 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
RELATED ARTICLES