రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి
ప్రజాపక్షం / హైదరాబాద్ : అసెంబ్లీ ఓటర్ల జాబితా ప్రకారమే పంచాయ తీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారుల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అసెం బ్లీ ఎన్నికలు రావడంతో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయని, బ్యాలట్ పేపర్ల ముద్రణ పూర్తయిందని, కొత్త సిబ్బందికి శిక్ష ణ ఇచ్చామన్నారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితాను పంపించామన్నారు. డిసెంబర్ 31 తర్వాత ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పా రు. నిబంధనలకు లోబడే ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.