సచివాలయం, హెచ్‌ఒడి ఉద్యోగుల ప్రమోషన్‌పై సిఎస్ ఆదేశాలు
ప్రజాపక్షం / హైదరాబాద్ : రాష్ట్రంలో సెక్రటేరియట్, హెచ్‌ఒడి జిల్లా స్థాయిలలో ఉద్యోగుల పదోన్నతులను ఎటువంటి జాప్యం లేకుండా ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని శాఖల కార్యదర్శులను, హెఒడిల ఉన్నతాధికారుల ను ఆదేశించారు. బిఆర్‌కెఆర్ భవన్‌లో సోమవారం వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ప్రమోషన్లతో పాటు కారుణ్య నియామకాల ప్రక్రియను ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలన్నారు. ప్రమోషన్లు ఇవ్వడం వల్ల వచ్చే ఖాళీలను కూడా ప్రత్యక్ష నియామకా ల నోటిఫికేషన్లలో చేర్చాలని ఆదేశించారు. ప్రమోషన్లు, కారుణ్య నియామకాలు, డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పోస్టుల భర్తీ అంశాలపై ఈ నెల 6వ తేదీ, 20వ తేదీ, 27వ తేదీలలో ప్రతి బుధవారం సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సిఎం కెసిఆర్ విజన్ ప్రకారం అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్‌ఒ డి అంశాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని హామీనిచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారులు అనురాగ్ శర్మ, కె.వి.రమణాచారి, ఎ.కె.ఖాన్, ఎస్.కె.జోషిలతో పాటు డిజిపి ఎం.మహేందర్‌రెడ్డి, పోలీస్ అధికారులు పూర్ణ చందర్‌రావు, గోపి కృష్ణ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాణి కుముదిని, సురేష్ చందా, అధర్ సిన్హా, ముఖ్యకార్యదర్శులు రజత్ కుమార్, అర్వింద్ కుమార్, రామక్రిష్ణారావు, సునీల్ శర్మ, జయేష్ రంజన్, రవిగుప్తా, హర్ ప్రీత్ సింగ్, కార్యదర్శులు, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
31లోగా పదోన్నతులు
RELATED ARTICLES