న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదానిచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో ప్రతీకారం తీర్చుకుంటామని జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సహా దేశవ్యాప్తంగా ఉన్న 30 విమానాశ్రయాల్లో భద్రతను ప్రభుత్వం పెంచేసింది. ఈ విషయాన్ని గురువారం అధికారులు చెప్పారు. జైషే మహ్మద్‌కు చెందిన షంషేర్ వనీ అనే వ్యక్తి హిందీలో టైపు చేసిన హెచ్చరిక లేఖను రాశాడని ‘బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ’కి చెందిన అధికారులు తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసినందుకు, రాష్ట్రాన్ని రెండుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆ తీవ్రవాద గ్రూపు ఆ లేఖలో హెచ్చరించింది. ఇదిలావుండగా ఢిల్లీ విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సిఐఎస్‌ఎఫ్) భద్రతా విధానంలో మార్పు లు చేసింది. ‘సాధారణ దుస్తుల్లో ఉన్న సాయుధులను విమానాశ్రయంలోపల మోహరించారు, అంతటా నిఘా ఉంచేందుకు డాగ్ స్కా ్వడ్ టీమ్, బాంబ్ డిటెక్షన్ టీమ్‌ను ఏర్పాటుచేశారు. పార్కింగ్ ప్రదేశంలో, ఆవరణ లో… అంతటా అలర్ట్‌గా ఉన్నాం’ అని పేరు తెలుప నిరాకరించిన సిఐఎస్‌ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఆకాశం నుంచి వచ్చే ఆపదను గుర్తించేందుకు కూడా వాచ్ టవర్లలో అప్రమత్తతను పెంచారు. జైషే మహ్మ ద్ తీవ్రవాద సంస్థ దేశంలోని 30 నగరాల్లో దాడులు చేస్తానని తన హెచ్చరిక లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ‘అహర్నిశలు ఉగ్రవాద వ్యతిరేక పరా క్రం వ్యాన్లు, అదనపు బలగాన్ని, రాత్రింబవళ్లు తరచూ గస్తీ ఉండేలా చూస్తు న్నాం’ అని కూడా ఆ అధికారి తెలిపారు. పండుగ సీజన్‌లో కశ్మీర్ తీవ్రవాద గ్రూపులు దాడులకు పాల్పడవచ్చనే సమాచారం కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి అందడంతో బుధవారం ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు.
30 విమానాశ్రయాల్లో అప్రమత్తత
RELATED ARTICLES