కుందజ్ : ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈశాన్య ఆఫ్ఘాన్‌లో ఆదివారం ఓ బంగారు గని కుప్పకూలింది. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెప్పారు. ఎప్పుడూ దాడులతో ఆఫ్ఘాన్ దద్దరిల్లుతూనే ఉంటుం ది. కాగా బదక్షన్ ప్రావిన్స్‌లోని కొహిస్తాన్ జిల్లాలో వాటిల్లిన ఈ ఘటనలో మరో ఏడుగురు గాయపడినట్లు జిల్లా గవర్నర్ మహమ్మద్ రుస్తాం రాఘి మీడియాకు తెలిపా రు. బంగారం కోసం నది ఒడ్డున గ్రామస్థులు 60 మీటర్ల లోతుకు తవ్వారు. అయితే వారు లోపల ఉండగానే చుట్టూ ఉన్న గోడలు కూలిపోయాయి. దీంతో డజన్ల కొద్ది మంది కార్మికులు చిక్కుకుపోయినట్లు రాఘి చెప్పా రు. అయితే గోడలు కూలడానికి గల కారణాలు తెలియరాలేదని, అయితే అనుభవం లేని వ్యక్తులు తవ్వకాలు జరపడం వల్లే గోడలు కూలి ఉండవచ్చని ప్రావిన్షియల్ గవర్నర్ అధికార ప్రతినిధి నిక్ మహమ్మద్ నాజరి వెల్లడించారు. ఈ గ్రామస్థులు కొన్ని దశాబ్దాలుగా ఇలా అక్రమంగా తవ్వకాలుజరుపుతున్నారని, వీరిపై ప్రభుత్వ నియంత్రణ లేదని ఆయన చెప్పారు.ఘటనా స్థలికి రెస్క్యూ టీం ను పంపామని, అప్పటికే గ్రామస్థులు మృతదేహాలను బయటకు తీశారని ఆయన వెల్లడించారు. కాగా, బాధిత కుటుంబాలకు నగదును చెల్లించేందుకు, గాయపడిన వారిని తరలించేందుకు రక్షణ మంత్రిత్వశాఖ హెలికాప్టర్లను పంపినట్లు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికార ప్రతినిధి హష్మత్ బహదూరి పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు. మృతులు కుటుంబ సభ్యులకు పరిహారం కింద 50 వేల అఫ్ఘున్లు, గాయపడిన వారికి 10 వేల అఫ్ఘున్లు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ఆప్ఘనిస్థాన్‌లో ఇలా అక్రమంగా బంగారం కోసం తవ్వకాలు జరపడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న సందర్భాలున్నాయి.
30 మందిని బలితీసుకున్న బంగారు గని
RELATED ARTICLES