వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిల
ప్రజాపక్షం / హైదరాబాద్ పార్టీ విలీనంపై ఈ నెల 30లోపు నిర్ణయం తీసుకుంటామని వైఎస్‌ఆర్ టిపి అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల తెలిపారు. విలీనం లేకుంటే వచ్చే ఎన్నికల్లో సొంతంగా బరిలో దిగుతామని చెప్పారు. హైదరాబాద్‌లోని లోట్‌స్ పాండ్‌లో వైఎస్‌ఆర్ టిపి కార్యాలయంలో షర్మిల అధ్యక్షతన సోమవారం ఆ పార్టీ రాష్ర్ట స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ జిల్లాల ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ విలీనం, ఎన్నికల వ్యూహంపై ప్రధాన చర్చ జరిగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ విలీనం కాకపోతే రాబోయే ఎన్నికల్లో 119 నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు వైఎస్‌ఆర్‌టిడిపి సిద్ధంగా ఉందన్నారు. అక్టోబర్ రెండో వారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని, పార్టీ కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతిఒక్కరికీ ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు
30లోపు విలీనంపై నిర్ణయం
RELATED ARTICLES