ప్రజాపక్షం/హైదరాబాద్ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షా లు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ఒక ప్రకటన లో పేర్కొంది. తేలికపాటి నుంచి భారీ వర్షా లు కురుస్తాయని స్పష్టం చేసింది. ఉత్తర కోస్తా, ఒడిశా దాని పరిధిలో ఉన్న బెంగాల్ ప్రాంతాల్లో అప్పపీడనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. రాగాల 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో రెండు రోజులు తేలికపాటి వర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. ఆదిలాబాద్, నిర్మల్, కోమరంభీం -ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు, వరంగల్- పట్టణ, వరంగల్- గ్రామీణ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగుడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. బూపాలపల్లి, వరంగల్- పట్టణం, ఎటునాగారం, పరకాల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని స్పస్టం చేశారు.
3 రోజులు వర్షాలు
RELATED ARTICLES