ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో గెలుపొందిన ఎంఎల్‌ఎలతో భేటీ అనంతరం సిఎంలపై రాహుల్ నిర్ణయం
కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన ఎస్‌పి, బిఎస్‌పి
జైపూర్/భోపాల్/రాయ్‌పూర్: వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కొత్త బలాన్ని పుంజుకుంది. ఎగ్జిట్ పోల్స్‌ను తల్లకిందులు చేస్తూ ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కావలసినంత మెజారిటీతో గెలుపొందింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి కళ్లెం వేసేందుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఫలితాలు పూర్తిగా వెలువడ్డాక మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ స్వల్ప మెజారిటీతో గెలుపొందింది. ప్రస్తుతం అందరి కళ్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఉన్నాయి. గెలుపొందిన మూడు రాష్ట్రాల్లో ఎవరిని ముఖ్యమంత్రి చేస్తారన్న ఆసక్తితో చూస్తున్నారు. అయితే ఆయన మాత్రం మూడు రాష్ట్రాల విజయం సాధించిన ఎంఎల్‌ఎలతో సమావేశమయ్యాకే ఒక నిర్ణయం తీసుకోనున్నారు. హిందీ ప్రాంతాల కు చెందిన మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మెరుగైన విజయం సాధించడంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ సాధించిన ఈ విజయం బిజెపి నకారాత్మక రాజకీయాలపై సా ధించిన విజయం’ అని అభివర్ణించారు. ప్రతిపక్ష ఐక్యతకు బలం చేకూర్చే విధంగా బహుజన్ సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మద్దతును ప్రకటించారు. కాగా 2019లో జరగనున్న సా ర్వత్రిక ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ఏర్పడే ప్రతిపక్ష కూటమిలో చేరతానని సమాజ్‌వాదీ పార్టీ సూచనలు చేసిం ది. ‘బిజెపికి ఇప్పటికే అప్రమత్త గంటికలు మోగాయి’ అని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ విలేకరులతో చెప్పారు. బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిలో చేరే విషయాన్ని కూడా ఆయన ధ్రువీకరించారు. తమకు పూర్తి మెజారిటీ లభించిందనిని కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి ముందు పిసిసి వద్ద సచిన్ పైలెట్ విలేకరులకు తెలిపారు. ఎంఎల్‌ఎల వ్యక్తిగత అభిప్రాయాలను ఎఐసిసి ప్రధాన కార్యదర్శి అవినాశ్ పాండే, పార్టీ పర్యవేక్షకుడు కెసి వేణుగోపాల్ తీసుకుంటారని కూడా చెప్పారు. రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 100 సీట్లు అవసరం. కాగా కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకు ని అతిపెద్ద పార్టీగా నిలిచింది. దాని మిత్రపక్షమైన రాష్ట్రీ య లోక్‌దళ్(ఆర్‌ఎల్‌డి) 1 సీటు గెలుచుకుంది. దాంతో ప్ర భుత్వ ఏర్పాటుకు కావలసిన సంఖ్యాబలం కాంగ్రెస్‌కు ల భించింది. బిజెపికి 73 సీట్లు, బిఎస్‌పికి 6 సీట్లు, సిపిఐ(ఎం)కు 2 సీట్లు, స్వతంత్రులు 13 సీట్లు, ఇతర పార్టీలు 6 సీట్లు గెలుచుకున్నారని ఎన్నికల సంఘం తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లో 15 ఏళ్ల రమణ్ సింగ్ నేతృత్వంలోని బిజెపి పాలన కు తెరపడింది. 90 మంది సభ్యులుండే అసెంబ్లీలో కాం గ్రెస్ 68 సీట్లు గెలుచుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అక్కడ 46 సంఖ్యాబలం చాలు. కాగా బిజెపి కేవ లం 15 సీట్లు గెలిచింది. ‘కాంగ్రెస్ శాసన సభాపక్షం స మావేశం బుధవారం రాత్రి జరిగింది.