ప్రజాపక్షం/హైదరాబాద్ మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపడీనం ప్రభావంతో వర్షాలు పడుతాయని స్పష్టం చేసింది. రాగల 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా పయణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో సోమవారం ఉద యం గానీ మధ్యాహ్నం గానీ వాయుగుండం తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో అక్టోబర్ 14న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. తీవ్ర అల్పపీడనం కారణంగా రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆదిలాబాద్, కోమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, వరంగల్ (పట్టణ, గ్రామీణం), మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలలో శనివారం ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు, ఆదివారం ఒకటి రెండుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సోమవారం ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
3 రోజులు వర్షాలు
RELATED ARTICLES