న్యూఢిల్లీ: రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు జడ్జీలలో ఒకరు అందుబాటులో లేకపోవడం వల్ల జనవరి 29న జరగాల్సిన రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూటైటిల్ వివాదం విచారణను రద్దు చేశారు. జనవరి 29న న్యాయమూర్తి ఎస్ ఎ బాబ్డే అందుబాటులో ఉండనందున భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణను రద్దు చేశారు. సుప్రీంకోర్టు రిజిష్ట్రీ ఈ మేరకు నోటీసును జారీ చేసింది. ఇదివరకు ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్న న్యాయమూర్తి యుయు లలిత్ విచారణ నుంచి తప్పుకోవడంతో జనవరి 25న ఐదుగురు జడ్జీలతో కొత్త రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. కొత్త ధర్మాసనాన్ని ఏరాటు చేశాక న్యాయమూర్తి ఎన్‌వి రమణ తొలిగిపోయారు. దాంతో మళ్లీ ధర్మాసనాన్ని ఏరాటు చేశారు. కొత్త రాజ్యాంగ ధర్మాసనం నుంచి రమణ తొలగిపోవడానికి కారణం తెలియలేదు. ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనంలో భారత ప్రధాన న్యాయమూర్తి కాకుండా న్యాయమూర్తులు ఎస్‌ఎ బాబ్డే, డివై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్‌ఎ నజీర్ ఉన్నారు.
29న జరిగే అయోధ్యకేసు విచారణ రద్దు
RELATED ARTICLES