కొవిడ్‌ రోగులను పీడిస్తున్న వైద్యులు
స్కానింగ్‌, బెడ్లకు వేలల్లో వసూళ్ళు
నిద్రావస్థలో మెడికల్‌ అధికారులు
ప్రజాపక్షం/ సూర్యాపేటబ్యూరో
కరోనా విపత్కర పరిస్ధితుల్లో కూడా మానవత్వా న్ని మరిచి ప్రైవేట్‌ వైద్యులు దోపిడీకి పాల్పడుతున్నారు. శవాలమీద పేలాలు ఏరుకునే విధంగా వ్యవహరిస్తూ వైద్య వృత్తికే కొందరు వైద్యులు మాయని మచ్చ తెస్తున్నారు. కొవిడ్‌ బారినపడిన వారు తమ ఆసుపత్రుల్లో చేరికైతే చాలు పీల్చిపిప్పి చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు, నిర్ణయించిన ధరలను బేఖాతర్‌ చేస్తున్నారు. టెస్టులు, స్కా నింగ్‌, బెడ్లకు వేలల్లో డబ్బులు వసూళ్ళు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా బెడ్లకు రోజుకు రూ. 15వేల నుండి 25వేల వరకు స్కానింగ్‌కు రూ. 3 నుండి 5వేల వరకు దండుకుంటున్నారు. కరోనా టెస్టులు స్థానికంగా చేసే అవకాశం లేకపోవడంతో హైదరాబాద్‌ వంటి నగరాలకు పంపుతూ వేలల్లో రూపాయలు గుంజుతున్నారు. ఇదంతా బహిరంగంగానే సాగుతున్నా వీరి దోపిడీని అరికట్టాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిద్రావస్థలో ఉన్నారు. దీంతో కరోనా రోగులు తమ ఒల్లు, ఇల్లును గుల్ల చేసుకుంటూ వైద్యుల దోపిడీకి లబోదిబోమంటున్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 177 ప్రైవేట్‌ ఆసుపత్రులు ప్రభుత్వం నుండి గుర్తింపు పొందగా, అనధికారికంగా ఇంతకంటే ఎక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వం నుండి గుర్తింపు పొందిన వాటిలో 127 ఆసుపత్రుల్లో కరోనా వైద్యాన్ని రోగులకు అందింస్తున్నారు. గతంలో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సాధారణ బెడ్‌ ధర రూ. 1000 నుండి 2 వేలు, క్యాజువాల్టీ బెడ్లకు రూ .2 వేల నుండి 3వేలు, ఐసియు బెడ్లకు రూ. 5వేల నుండి 6వేల వరకు చార్జీలు తీసుకునే వారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉండటంతో ఇదే ఆదును చేసుకొని కొందరు ప్రైవేట్‌ వైద్యులు బెడ్‌ చార్జీలను అమాంతం పెంచారు. మహానగరాల్లోని కార్పొరేట్‌ ఆసుపత్రులను తలదన్నేలా ఒక బెడ్‌కు రోజుకు రూ. 15వేల నుండి 25వేల వరకు వసూల్‌ చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే మేము తీసుకునే డబ్బులు చాలా తక్కువ అని డాక్టర్‌ విజిటింగ్‌, ఆక్సిజన్‌, మానిటరింగ్‌, నర్సింగ్‌ కేర్‌ వంటి అన్నింటికీ కలిపి ఈ ధర నిర్ణయించామని చెబుతున్నారు. స్కానింగ్‌కు గతంలో రూ. 2500 ఉండగా నేడు రూ. 3వేల నుండి 5వేల వరకు వసూళ్ళు చేస్తున్నారు. దీని ధరలను ప్రభుత్వం రూ. 2వేలుగా నిర్ధారించింది. కరోనా వ్యాధికి సంబంధించిన కొన్ని టెస్టులు చేసేందుకు స్థానిక ల్యాబ్‌లో టెక్నాలజీ లేకపోవడంతో హైదరాబాద్‌ వంటి మహా నగరాలకు నమూనాలను పంపుతూ వందల్లో అయ్యే టెస్టులకు వేలల్లో డబ్బులు గుంజుతున్నారు. వీరి దోపిడీ అరికట్టేందకు ప్రభుత్వం కొవిడ్‌ చికిత్స ఫీజులను నిర్ధారిస్తూ జిఒ నెంబరు 248ని జారీ చేసింది. ఇందులో బెడ్ల చార్జీలను మూడు కెటగిరీలుగా విభజించింది. రూ. 4వేలు, రూ. 6వేల 500, రూ. 9వేలు నిర్ణయించింది. ఇంత కంటే ఒక రూపాయి ఎక్కువ తీసుకున్న చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయినా ప్రైవేట్‌ వైద్యులు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ దోపిడీ సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్కువగా ఉంది. ఈ వైద్యుల బాటలోనే మేము ఏమన్నా తక్కువనా అనే విధంగా నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపల్‌ కేంద్రాల్లో ఉన్న ప్రైవేట్‌ ఆసుపత్రుల నిర్వాహకులు కూడా రోగులను దోచుకుంటున్నారు.
నిద్రావస్ధలో మెడికల్‌ అధికారులు
ప్రైవేట్‌ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాల్సిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిద్రావస్థలో ఉన్నారు. కరోనా కష్టకాలంలో రోగులకు అండగా నిలబడాల్సిన వారు ప్రైవేట్‌ వైద్యుల దోపకానికి మరింత ఊతం ఇస్తున్నారు. ఎక్కడ కూడా తనిఖీలు చేసిన పాపానపోలేదు. రోగులను అడిగి తెలుసుకోవడం లేదు. ఉన్నత స్ధాయి అధికారులకు మాత్రం నివేదికలు ఇవ్వడం, టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించడంతోనే సరిపెడుతున్నారు. జిల్లాలో రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ను బ్లాక్‌ చేసి అధిక ధరలకు అమ్ముతున్నారని ఆయా ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో పెద్ద ఎత్తున వరస కథనాలు వచ్చినా స్పందించలేదు. ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీసులు స్పందించి ఈ దందా చేస్తున్న కేటుగాళ్ళను పట్టుకొని కటకటాలకు పంపారు. ఈ తతంగం ముగిసిన తర్వాత ఎదో తాము తనిఖీ చేశామని చెప్పుకునేందుకు జిల్లా కేంద్రంలోని రెండు ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లి తనిఖీలు చేశారు. జిల్లా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కూడా తమ కార్యాలయాలనికే పరిమితమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్‌ వైద్యుల దోపకంలో అధికారులకు వాటాలు అందుతున్నట్లు సమాచారం.
ఎలాంటి ఫిర్యాదులు అందలేదు : చలం
ప్రైవేట్‌ ఆసుపత్రుల దోపకంపై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కోటా చలం తెలిపారు. ప్రజాపక్షంతో ఆయన మాట్లాడుతూ ఎవరైన తమకు ఫిర్యాదులు చేస్తే తప్పక చర్యలు తీసుకుంటామని చెప్పారు. బెడ్ల చార్జీలు, స్కానింగ్‌లకు అధిక ఫీజులు వసూళ్ళు చేస్తున్నారని ప్రశ్నించగా అలాంటిది ఏమి లేదని చెప్పుకొచ్చారు. తాము జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉండటంతో ఇదే ఆదును చేసుకొని కొందరు ప్రైవేట్‌ వైద్యులు బెడ్‌ చార్జీలను అమాంతం పెంచారు. మహానగరాల్లోని కార్పొరేట్‌ ఆసుపత్రులను తలదన్నేలా ఒక బెడ్‌కు రోజుకు రూ. 15వేల నుండి 25వేల వరకు వసూల్‌ చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే మేము తీసుకునే డబ్బులు చాలా తక్కువ అని డాక్టర్‌ విజిటింగ్‌, ఆక్సిజన్‌, మానిటరింగ్‌, నర్సింగ్‌ కేర్‌ వంటి అన్నింటికీ కలిపి ఈ ధర నిర్ణయించామని చెబుతున్నారు. స్కానింగ్‌కు గతంలో రూ. 2500 ఉండగా నేడు రూ. 3వేల నుండి 5వేల వరకు వసూళ్ళు చేస్తున్నారు. దీని ధరలను ప్రభుత్వం రూ. 2వేలుగా నిర్ధారించింది. కరోనా వ్యాధికి సంబంధించిన కొన్ని టెస్టులు చేసేందుకు స్థానిక ల్యాబ్‌లో టెక్నాలజీ లేకపోవడంతో హైదరాబాద్‌ వంటి మహా నగరాలకు నమూనాలను పంపుతూ వందల్లో అయ్యే టెస్టులకు వేలల్లో డబ్బులు గుంజుతున్నారు. వీరి దోపిడీ అరికట్టేందకు ప్రభుత్వం కొవిడ్‌ చికిత్స ఫీజులను నిర్ధారిస్తూ జిఒ నెంబరు 248ని జారీ చేసింది. ఇందులో బెడ్ల చార్జీలను మూడు కెటగిరీలుగా విభజించింది. రూ. 4వేలు, రూ. 6వేల 500, రూ. 9వేలు నిర్ణయించింది. ఇంత కంటే ఒక రూపాయి ఎక్కువ తీసుకున్న చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయినా ప్రైవేట్‌ వైద్యులు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ దోపిడీ సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్కువగా ఉంది. ఈ వైద్యుల బాటలోనే మేము ఏమన్నా తక్కువనా అనే విధంగా నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపల్‌ కేంద్రాల్లో ఉన్న ప్రైవేట్‌ ఆసుపత్రుల నిర్వాహకులు కూడా రోగులను దోచుకుంటున్నారు.
నిద్రావస్ధలో మెడికల్‌ అధికారులు
ప్రైవేట్‌ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాల్సిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిద్రావస్థలో ఉన్నారు. కరోనా కష్టకాలంలో రోగులకు అండగా నిలబడాల్సిన వారు ప్రైవేట్‌ వైద్యుల దోపకానికి మరింత ఊతం ఇస్తున్నారు. ఎక్కడ కూడా తనిఖీలు చేసిన పాపానపోలేదు. రోగులను అడిగి తెలుసుకోవడం లేదు. ఉన్నత స్ధాయి అధికారులకు మాత్రం నివేదికలు ఇవ్వడం, టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించడంతోనే సరిపెడుతున్నారు. జిల్లాలో రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ను బ్లాక్‌ చేసి అధిక ధరలకు అమ్ముతున్నారని ఆయా ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో పెద్ద ఎత్తున వరస కథనాలు వచ్చినా స్పందించలేదు. ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీసులు స్పందించి ఈ దందా చేస్తున్న కేటుగాళ్ళను పట్టుకొని కటకటాలకు పంపారు. ఈ తతంగం ముగిసిన తర్వాత ఎదో తాము తనిఖీ చేశామని చెప్పుకునేందుకు జిల్లా కేంద్రంలోని రెండు ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లి తనిఖీలు చేశారు. జిల్లా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కూడా తమ కార్యాలయాలనికే పరిమితమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్‌ వైద్యుల దోపకంలో అధికారులకు వాటాలు అందుతున్నట్లు సమాచారం.
ఎలాంటి ఫిర్యాదులు అందలేదు : చలం
ప్రైవేట్‌ ఆసుపత్రుల దోపకంపై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కోటా చలం తెలిపారు. ప్రజాపక్షంతో ఆయన మాట్లాడుతూ ఎవరైన తమకు ఫిర్యాదులు చేస్తే తప్పక చర్యలు తీసుకుంటామని చెప్పారు. బెడ్ల చార్జీలు, స్కానింగ్‌లకు అధిక ఫీజులు వసూళ్ళు చేస్తున్నారని ప్రశ్నించగా అలాంటిది ఏమి లేదని చెప్పుకొచ్చారు. తాము జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments