కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
కరోనా వ్యాక్సిన్ వేసుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
పలు రాష్ట్రాల సిఎంలు, ఇతర దిగ్గజాలు కూడా..
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ ను దేశవ్యాప్తంగా మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 24 గంట లూ ప్రజలకు కొవిడ్-19 వ్యా క్సిన్‌ను అందుబాటులో ఉంచుతామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి వెల్లడించారు. ప్రజలు వారికి అనుకూలమైన సమయాల్లో వచ్చి వ్యాక్సిన్ తీసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. అన్ని ఆస్పత్రుల్లో టీకా వేయడానికి ఉన్న సమయ పరిమితిని ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రధాని నరేం ద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్దన్ తెలిపారు. అదే విధంగా ప్రజలకు కొవిడ్ టీకాలు వేయడానికి ప్రైవేట్ ఆస్పత్రులు కూడా అన్నివేళల్లో అందుబాటులో ఉంటాయన్నారు. కరోనా వ్యాక్సిన్ డ్రైవ్‌లో పాల్గొన్న అన్ని ఆస్పత్రులు కోవిన్ యాప్, వెబ్‌సైట్ ద్వారా అనుసంధానం చేయబడినట్లు తెలిపారు. దీంతో అన్ని ఆస్పత్రుల్లో కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించడానికి సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. కోవిన్ పోర్టల్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే టీకా అందుబాటులఉంటుందనే నిబంధన ఏమి లేదని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఆస్పత్రి యాజమాన్యం కోరుకున్న సమయంలో ప్రజలకు టీకాలు అందించే అనుమతి ఉందని తెలిపారు.
వ్యాక్సిన్ తీసుకున్న దిగ్గజాలు
దేశవ్యాప్తంగా మార్చి 1 నుంచి రెండోదశ టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. మొదటి దశలో ఫ్రంట్‌లైన్, ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్‌ను అందించగా, రెండో దశలో 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు పైబడి ఇతర అనారోగ్యంతో బాధపడుతున్నవారికి కొవిడ్-19 వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ తొలిడోస్‌ను స్వీకరించారు. ముఖ్యంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మేఘాలయ గవర్నర సత్యపాల్ సింగ్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, అతని భార్య లక్ష్మి సహా, ఇతర రాజకీయ ప్రముఖులు వాక్సిన్ అందుకున్నారు. అలాగే క్రికెట్ దిగ్గజం భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, ఫుట్‌బాల్ దిగ్గజం పీలే, సీనీ రంగ ప్రముఖుడు చారుహాసన్, కూడా కరోనా టీకాను స్వీకరించడం గమనార్హం. మరోవైపు సీరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సిరం సిఇఒ భార్య నటాషా పూనావాలా మంగళవారం వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాలో షేర్ చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చి అండ్ రిఫరల్ ఆసుపత్రిలో ఆయన కొవిడ్ టీకా తీసుకున్నారు. రాష్ట్రపతి వెంట ఆయన కుమార్తె కూడా వచ్చారు. ఈ ఫొటోలను రాష్ట్రపతి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. చరిత్రలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నందుకు వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు రామ్‌నాథ్ కోవింద్ కృతజ్ఞతలు తెలియజేశారు. అర్హులైన పౌరులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
24×7 టీకా తీసుకోవచ్చు
RELATED ARTICLES