రాజస్థాన్ రెబల్ ఎంఎల్‌ఎల అనర్హతపై హైకోర్టు
అసమ్మతి నేత సచిన్ పైలట్‌కు ఊరట
జైపూర్: రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభానికి కారణమైన అసమ్మతి నేత సచిన్ పైలట్‌కు రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. ఈనెల 24 వరకు రెబల్ ఎంఎల్‌ఎల అనర్హతపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు రాజస్థాన్ స్పీకర్‌ను ఆదేశించింది. అనర్హత ఎంఎల్‌ఎల పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిసిన అనంతరం ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై వచ్చే శుక్రవారం (జులై 24) హైకోర్టు తీర్పు వెలువరించనుంది. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్, అతని వర్గం ఎంఎల్‌ఎలు 18 మంది తిరుగుబాటు బావుటా ఎగరేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ శాసనసభా పక్షం రెండు భేటీలకూ వారు హాజరు కాలేదు. దాంతో సచిన్ సహా 19 మంది అసమ్మతి ఎంఎల్‌ఎలపై అనర్హతన వేటు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విప్ ధిక్కరణపై స్పీకర్ సిపి జోషి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే, నిబంధనలు అనుసరించకుండా తమకు నోటీసులు ఇచ్చారని పేర్కొంటూ అసమ్మతి ఎంఎల్‌ఎలు కోర్టు మెట్లెక్కారు.
24 వరకు చర్యలు తీసుకోవద్దు
RELATED ARTICLES