దేశంలో 85 వేలు దాటిన మృతుల సంఖ్య
ఒక్క రోజులో 93,337 మందికి కరోనా పాజిటివ్
53 లక్షలు దాటిన బాధితుల సంఖ్య
42 లక్షలు దాటి దూసుకెళ్తున్న రికవరీలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వారస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజుల నుంచి నిత్యం 90 వేలకు పైగా కొత్త కేసులు బయట పడుతున్నాయి. శనివారం ఉదయం నాటికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 53 లక్షలు దాటిం ది. మరణాల సంఖ్య మరోసారి 1200కుపైగా నమోదవుతుంది. మొత్తం 85 వేలకుపైగా మంది మృత్యువాత పడ్డా రు. ఇక మహమ్మారి నుంచి ఒక్కరోజే దాదాపు 96 వేల మంది బాధితులు కోలుకున్నారు. అయితే 24 గంటల్లో కొత్తగా 93 వేలకుపైగా మందికి పాజిటివ్ నిర్ధారణ అయిం ది. కొత్త కేసుల కంటే తాజా రికవరీల సంఖ్య అధికంగా ఉండడం కాస్త ఉపశమనం కలిగిస్తుంది. మొత్తం రికవరీల సంఖ్య సంఖ్య 42 లక్షలు దాటింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం నాటికి గడిచిన 24 గంటల్లో 93,337 కొత్తకేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 53,08,014కు చేరింది. అదే విధంగా 24 గంటల్లో 1,247 మందిని కరోనా బలితీసుకుంది. మరణాల సంఖ్య ఒక్క రోజ వ్యవధిలో 1200 దాటటం ఇంది మూడవసారి. కొత్త మరణాలతో కలిపి దేశంలో ఇప్పటి వరకు 85,619 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. మరణాల రేటు 1.61 శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది. కొవిడ్ 19తో మరణిస్తున్న వారిలో దాదాపు 70 శాతానికిపైగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేస్తుంది. ఇక శనివారం ఉదయం నాటికి 42,08,431 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 24 గంటల్లో 95,880 మంది కరోనాను జయించగా, 93,337 కొత్త కేసులు వెలుగు చూశాయి. రికవరీ రేటు ఏకంగా 79.28 శాతానికి ఎగబాకింది. ప్రస్తుతం దేశంలో 10,13,964 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కరోనా కేసుల్లో ఈ సంఖ్య 19.10 శాతం మాత్రమేనని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఆగస్టు 7న కరోనా బాధితుల సంఖ్య 20 లక్షల మార్క్ దాటగా, ఆగస్టు 23 నాటికి 30 లక్షలు, సెప్టెంబర్ 5 నాటికి 40 లక్షలకు చేరుకోగా, సెప్టెంబర్ 16 నాటికి 50 లక్షలు దాటింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా తొలిస్థానంలో ఉండగా, భారత్ రెండవ స్థానంలో, బ్రెజిల్ మూడవ స్థానంలో ఉంది. మృతుల సంఖ్యలో మాత్రం భారత్ మూడవ స్థానంలో కొనసాగుతుంది. ఇక దేశం వ్యాప్తంగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 6,24,54,254 శాంపిళ్లకు కరోనా పరీక్షలు పూర్తిచేసినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్) వెల్లడించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా 8,81,911 శాంపిళ్లకు కొవిడ్ టెస్టులు నిర్వహించినట్లు పేర్కొంది. కొవిడ్ నిర్ధారణ పరీక్షలు భారీగా నిర్వహిస్తుండడంతో అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు బయట పడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది.
మహారాష్ట్రలో ఒక్కరోజే 440 మరణాలు
మహారాష్ట్రలో 24 గంటల్లో 21,656 మంది మహమ్మారి బారిన పడగా, 440 మంది మత్యువాతపడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 31,791గా ఉండగా, కేసుల సంఖ్య 11,67,496కు చేరింది. తమిళనాడులో 24 గంటల్లో 67 మంది మరణించగా, కొత్తగా 5,488 మందికి వైరస్ సోకింది. దీంతో మృతుల సంఖ్య 8,685, బాధితుల సంఖ్య 5,30,908కి చేరింది. కర్నాటకలో కొత్తగా 179 మరణాలు సంభవించాయి. 8,626 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 7,808కి, కేసుల సంఖ్య 5,02,982కు చేరింది. ఢిల్లీలో తాజాగా 4,127 మందికి వైరస్ సోకింది. 24 గంటల్లో 30 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 4,907కు, బాధితుల సంఖ్య 2,38,828కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో 67 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం మృతులు 5,244కు చేరారు. రాష్ట్రంలో కొత్తగా 8,096 కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య 6,09,558కి చేరింది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం మృతులు 4,869 కాగా, కొత్తగా 98 మంది మరణించారు. 6,494 మందికి కరోనా సోకింది. ఇప్పటి వరకు 3,42,788 మంది కరోనా బారిన పడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం మృతులు 4,242 కాగా, తాజాగా 59 మంది చనిపోగా, మొత్తం 2,18,772 మందికి వైరస్ సోకింది. గుజరాత్‌లో మొత్తం మృతులు 3,286 కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 1,20,336 కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా 1,410 మందికి వైరస్ సోకింది. పంజాబ్‌లో మృతుల సంఖ్య 2,708 నమోదు కాగా, ఒక్క రోజులో 62 మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లో మృతుల సంఖ్య 1,901గా ఉండగా, మొత్తం 1,00,458 కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో మొత్తం మృతుల సంఖ్య 1,308 నమోదు కాగా, మొత్తం బాధితుల సంఖ్య 1,11,290కి చేరింది.
24 గంటల వ్యవధిలో.. 1,247 మరణాలు
RELATED ARTICLES