విదేశాల నుంచి వచ్చినవారికి దండం పెట్టి చెబుతున్నా.. కచ్చితంగా రిపోర్ట్ చేయండి
ప్రధాని 14 గంటలే అన్నారు, మనం 24 గంటలు పాటిద్దాం
రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ పిలుపు
తెలంగాణలో 21 కేసులు నమోదైనట్టు వెల్లడి
52 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం
78 ప్రత్యేక బృందాలను మోహరించాం
కరోనా కట్టడికి రూ. 10 వేల కోట్లను ఖర్చు చేసేందుకు కూడా సిద్ధం
పరిస్థితి చేయిదాటిపోతే రాష్ట్రాన్ని షట్డౌన్ చేస్తాం
హైదరాబాద్ : రాష్ట్రంలో 24 గంటల పాటు ‘జనతా కర్ఫ్యూ’ పాటిద్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ 14 గంటల జనతా కర్ఫ్యూని ప్రకటించగా, రాష్ట్రంలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు 24 గంటలపాటు జనతా కర్ఫ్యూను పాటించి దేశానికే ఆదర్శంగా నిలుద్దామన్నారు. ప్రధాని మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు నేపథ్యంలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సిఎం కెసిఆర్ శనివారం ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడారు. కరో నా వైరస్ దేశంలో ఎవరిని ఏం చేసినా తెలంగాణ వాళ్లను ఏం చేయలేకపోయిందనేలా వ్యవహరిద్దామని సిఎం అన్నారు. రాష్ట్రంలో ఆదివారం అత్యవసర సేవల సిబ్బంది మాత్రమే పనిచేయనున్నట్లు తెలిపారు. మిగతా వారంతా ఎవరికి వారే స్వచ్ఛందంగా బంద్ పాటించాలన్నారు. ఇది ఒక కఠిన సమయమని, సంకట స్థితి అని, స్వయం నియంత్రణ పాటించాలన్నా రు. అందరం కలిసి పాటిస్తే తప్ప ఇది సాధ్యం కాదన్నారు. స్వీయ నియంత్రణ మనల్ని కాపాడుతదన్నారు. మన కోసం, మన కుటుంబం కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం, మన ప్రపంచం కోసం అందరం కలిసి జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొందామన్నారు.
24 గంటల జనతా కర్ఫ్యూ
RELATED ARTICLES