లక్షన్నరకు చేరువైన ‘కరోనా’
4,167కి చేరిన మొత్తం మరణాలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా(కొవిడ్-19) వైరస్ విజృంభణ కొనసాగుతోంది. బాధితుల సంఖ్య లక్షన్నరకు చేరువయ్యింది. గత 24 గంటల్లో 6,535 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 146 మరణాలు సంభవించాయి. దీంతో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 1,45,380కు, మృతులు 4,167కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా 80,722 మంది చికిత్స పొందుతుండగా, 60,490 మందికిపైగా కోలుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 41.61 శాతం మంది రోగులు కోలుకున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే మొత్తం పాజిటివ్ కేసుల్లో విదేశీయులు కూడా ఉన్నారు. సోమవారం ఉదయం నుంచి 146 మంది మృత్యువాత పడగా, మహారాష్ట్రలో 60 మంది, గుజరాత్ 30, ఢిల్లీ 10, మధ్య ప్రదేశ్ 10, తమిళనాడు ఏడు, పశ్చిమ బెంగాల్ ఆరు, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌ల్లో నలుగురు చొప్పున, తెలంగాణలో ముగ్గురు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, కర్ణాటకల్లో ఇద్దరేసి చొప్పున, కేరళలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల్లో 4,167 మందికిగాను మహారాష్ట్రలో అత్యధికంగా ఇప్పటి వరకు 1,695 మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాతి స్థానాల్లో గుజరాత్‌లో 888, మధ్య ప్రదేశ్ 300, పశ్చిమ బెంగాల్ 278, ఢిల్లీ 276, రాజస్థాన్ 167, ఉత్తర ప్రదేశ్ 165, తమిళనాడు 118, ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణాల్లో 56 మంది చొప్పున, కర్ణాటక 44, పంజాబ్ 40, జమ్మూకాశ్మీర్ 23, హర్యానా 16, బీహార్ 13, ఒడిశా ఏడు, కేరళ, హిమాచల్ ప్రదేశ్ ఐదు, జార్ఖండ్, అసోంలో నలుగురు చొప్పున, చండీగడ్, ఉత్తరాఖండ్‌ల్లో ముగ్గురు చొప్పున, మేఘాలయలో ఒకరు మరణించినట్లు మంత్రిత్వ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. అయితే 70 శాతానికి పైగా మరణాలకు ఇతరత్రా ఆరోగ్య కారణాలు కూడా తోడయ్యాయని వివరించింది. కాగా మంగళవారం ఉదయానికి మహారాష్ట్రలో అత్యధికంగా 52,667 కేసులు నమోదు కాగా, తమిళనాడులో 17,082, గుజరాత్ 14,460, ఢిల్లీ 14,053, రాజస్థాన్ 7,300, మధ్య ప్రదేశ్ 6,859, ఉత్తర ప్రదేశ్‌లో 6,532, పశ్చిమ బెంగాల్ 3,816, ఆంధ్ర ప్రదేశ్ 3,100, బీహార్‌లో 2,730 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 2,182, పంజాబ్‌లో 2,060, తెలంగాణ 1,920, జమ్మూకాశ్మీర్ 1,668, ఒడిశా 1,438, హర్యానా 1,184, కేరళ 896, అసోం 526, జార్ఖండ్ 377, ఉత్తరాఖండ్ 349, చత్తీస్‌గడ్ 291, చండీగడ్ 238, హిమాచల్ ప్రదేశ్ 223, త్రిపుర 194, గోవా 67, లడఖ్ 52, పుదుచ్చేరి 41, మణిపూర్ 39, అండమాన్, నికోబార్ దీవులు 33, మేఘాలయ 14, నాగాలాండ్ మూడు, దాదర్ నగర్ హవేలి, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో రెండేసి, మిజోరం, సిక్కింల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి.