దేశంలో 3,04,019కి చేరిన కరోనా బాధితులు
తాజాగా 10,956 పాజిటివ్‌లు, 396 మంది మృతి
8,498కి చేరిన మరణాల సంఖ్య
మహారాష్ట్రలోనే లక్ష కేసులు
ప్రపంచంలోనే 4వ స్థానంలో భారత్
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి ఉధృతి రోజురోజుకీ పెరిగిపోతోంది. దేశంలో ఈ మహమ్మారి బారిన పడినవారి సంఖ్య 3లక్షల మార్కును దాటేసింది. శుక్రవారం ఉదయం 8గంటల వరకు దేశంలో 2,97,535 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించగా.. సాయంత్రానికి వేలాది కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,04,019కి పెరిగింది. మరోవైపు, దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్ర లక్షకు పైగా కేసులతో తొలి స్థానంలో నిలవగా.. తమిళనాడు 40,698 కేసులు, ఢిల్లీ 34,687 కేసులతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచంలో కరోనా వైరస్ అత్యధికంగా ప్రభావితం చేస్తున్న టాప్ 10 దేశాల్లో భారత్ నాలుగో స్థానానికి చేరుకుంది. దేశంలో గతకొన్ని రోజులుగా నిత్యం దాదాపు పదివేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 24గంటల్లో దేశవ్యాప్తంగా 10,956 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకూ దేశంలో మొత్తం 3 లక్షల కేసులు నమోదు కాగా.. కరోనా మరణాల సంఖ్య కూడా 8,498కి చేరింది. ఈ సంఖ్య ఒకరోజులో 396 మంది కరోనాతో మృతిచెందడంతో ఒక్కసారిగా భారీగా పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 1,41,842 ఉంటే.. కోలుకున్న వారి సంఖ్య 1,47,194 మందిగా నమోదైంది. వీరిలో ఒకరు విదేశాలకు వలస వెళ్లినట్టు గుర్తించారు. ఇప్పటివరకూ భారతదేశంలో మొత్తంగా 49.47 శాతం మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు అధికారి ఒకరు వెల్లడించారు. కరోనా ధ్రువీకరించిన మొత్తం కేసుల్లో ఎక్కువ మంది విదేశీయులే ఉన్నారు. కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నప్పటికీ వైరస్ నుంచి కోలుకునే వారిసంఖ్య కూడా పెరగడం కాస్త ఊరటనిస్తోంది. కాగా, దేశంలో గతకొన్ని రోజులుగా నిత్యం దాదాపు 10వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో గడిచిన పదిరోజుల్లోనే దేశంలో 98,829 కేసులు, 2900 కొవిడ్ మరణాలు చోటుచేసుకున్నాయి. జూన్ 2న 1,98,706 పాజిటివ్ కేసులు, 5598 మరణాలు ఉండగా జూన్ 12 నాటికి ఈ సంఖ్య 3,04,019 కేసులు, 8498 మరణాలకి చేరింది.
ప్రపంచంలోనే 4వ స్థానంలో భారత్
తాజా కేసులతో ప్రపంచంలోనే అత్యధికంగా కొవిడ్ కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానానికి చేరింది. ఇప్పటివరకు 2,92,000 పాజిటివ్ కేసులతో నాలుగో స్థానంలో ఉన్న బ్రిటన్‌ను తాజాగా భారత్ దాటేసింది. ప్రపంచంలో 20లక్షల కొవిడ్ పాజిటివ్ కేసుల నమోదుతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో ఇప్పటివరకు 8లక్షల పాజిటివ్ కేసులు నమోదుకాగా, 5లక్షల కేసులతో రష్యా మూడో స్థానంలో కొనసాగుతోంది. తాజాగా భారత్ కరోనా కేసుల్లో ప్రపంచంలోనే నాలుగో స్థానానికి చేరడం కలవరపెడుతోంది.
RELATED ARTICLES