23 నుండి రిజిస్ట్రేషన్లు
ప్రజాపక్షం / హైదరాబాద్ : అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి బుధవారం జారీ చేయాల్సిన దోస్త్ నోటిఫికేషన్ ఈ నెల 22కు వాయిదా పడింది. 22న నోటిఫికేషన్ జారీ చేస్తామని, 23 నుండి దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ హెల్ప్‌లైన్ సెంటర్లలో విద్యార్థులు చేసే చిన్నపాటి పొరపాట్లను సరిదిద్దుకోవచ్చు. రాష్ట్రంలోని 15 కళాశాలల్లో విద్యార్థులు నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ సారి ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ లోనే ఫీజు చెల్లించి తమ సీటును నిర్ధారణ చేసుకోవచ్చన్నారు. కులం, ఆదాయ ధృవపత్రాలు జతపరిచే విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఉంటుందన్నారు. ఆయా కళాశాల్లో సీటు వచ్చిన విద్యార్థులకు జులై 1 నుండి తరగతులు ప్రారంభం అవుతాయి.