రాష్ట్రంలో 1,69,169కు చేరుకున్న కరోనా పాజిటివ్‌లు
మరో 9 మంది మృతి
1025కు పెరిగిన మృతులు
30,636 యాక్టివ్ కేసులు
ప్రజాపక్షం / హైదరాబాద్ గత ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2,123 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,69,169 కు చేరుకున్నది. కాగా 2,151 మంది డిశ్చార్జ్ కావడంతో, ప్రస్తుతం రాష్ట్రంలో 30,636 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే తొమ్మిది మంది మరణించడంతో, మరణాల సంఖ్య 1025కు చేరింది. 24,070 మంది హోం ఐసోలేషన్ లేదా ఇన్స్‌టిట్యూషనల్ హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. జిల్లాల వారీగా పాజిటివ్ కేసుల వివరాలను పరిశీలిస్తే.. జిహెచ్‌ఎంసిలో 305, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 149, రంగారెడ్డిలో 185 మందికి శుక్రవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇక ఆదిలాబాద్‌లో 19, భద్రాద్రి కొత్తగూడెంలో 53, జగిత్యాలలో 53, జనగామలో 28, జయశంకర్ భూపాలపల్లిలో 23, జోగులాంబ గద్వాలలో 26, కామారెడ్డిలో 72, కరీంనగర్‌లో 112, ఖమ్మంలో 93, కొమరంభీమ్ ఆసిఫాబాద్‌లో 16, మహబూబ్‌నగర్‌లో 33, మహబూబాబాద్‌లో 77, మంచిర్యాలలో 30, మెదక్‌లో 34, ములుగులో 20, నాగర్ కర్నూల్‌లో 40, నల్లగొండలో 135, నారాయణపేటలో 18, నిర్మల్‌లో 23, నిజామాబాద్‌లో 78, పెద్దపల్లిలో 48, రాజన్న సిరిసిల్లలో 43, సంగారెడ్డిలో 59, సిద్ధిపేటలో 87, సూర్యాపేటలో 65, వికారాబాద్‌లో 22, వనపర్తిలో 26, వరంగల్ రూరల్‌లో 29, వరంగల్ అర్బన్ 81, యాదాద్రి భువనగిరిలో41 కేసులు రికార్డయ్యాయి.
2,123 కేసులు.. 2,151 మంది డిశ్చార్జ్
RELATED ARTICLES