HomeNewsBreaking News21 తేదీల్లో మణిపూర్‌లోసిపిఐ ప్రతినిధి బృందం పర్యటన

21 తేదీల్లో మణిపూర్‌లోసిపిఐ ప్రతినిధి బృందం పర్యటన

డి.రాజా నేతృత్వంలో అధ్యయనం అనంతరం గవర్నర్‌కు వాస్తవ పరిస్థితుల వివరణ
న్యూఢిల్లీ :
జాతి హింసా ప్రభావిత మణిపూర్‌ రాష్ట్రాన్ని ఈ నెల 21 తేదీల్లో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నేతల ప్రతినిధి బృందం పర్యటించనుంది. ప్రతినిధి బృందానికి సిపిఐ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపి డి.రాజా నేతృత్వం వహిస్తారు. ప్రతినిధి బృందంలో సిపిఐ జాతీయ కార్యదర్శి, ఎంపి బినోయ్‌ విశ్వం, సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్‌ కె.నారాయణ, రామకృష్ణ పాండా, అస్సాంకు చెందిన సిపిఐ జాతీయ సమితి సభ్యురాలు, సీనియర్‌ మహిళా నాయకురాలు అసోమి గొగోయ్‌ ఉన్నారు. మణిపూర్‌ రాష్ట్రం మొత్తం 3 నెలలకు పైగా జాతి హింస కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సిపిఐ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. సిపిఐ ప్రతినిధి బృందం ఈ నెల 21న ఇంఫాల్‌ చేరుకుంటుంది. రాష్ట్రంలో జరిగిన హింసాకాండలో బాధితులను కలుసుకుని వారి బాధలను తెలుసుకుంటుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షోభానికి సంబంధించి సమాజంలోని అన్ని వర్గాలతో కూడా ప్రతినిధి బృందం చర్చలు జరిపి రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడానికి, సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ప్రతినిధి బృందం ఈ నెల 24 వరకు మణిపూర్‌లోనే మకాంవేసి లోయ, కొండ ప్రాంతాల్లోని వివిధ ఏరియాలె, సహాయక శిబిరాలను సందర్శిస్తుంది. ప్రతినిధి బృందం మణిపూర్‌ గవర్నర్‌ అనుసూయా ఉయికేను కలిసి అక్కడి వాస్తవ పరిస్థితులను వివరిస్తుంది. మణిపూర్‌ ఐక్యతకు సిపిఐ నేత జన్‌ నేత హిజామ్‌ ఇరాబోట్‌ చేసిన కృషి అసమానమైనదని, ఈ నెల 23న పార్టీ 75వ వ్యవస్థాపక దినోత్సవ సమావేశంలో ప్రతినిధి బృందం పాల్గొంటుందని పార్టీ ఆ ప్రకటనలో వివరించింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments