కొద్ది రోజుల క్రితం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ 2020లో రిలీజయ్యే అవకాశాలు కనిపించడం లేదనీ, 2021 సంక్రాంతిని టార్గెట్‌గా చేసుకొని రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయనీ ‘ప్రజాపక్షం’ ముందే చెప్పింది. అది ఇప్పుడు అక్షరాలా నిజమైంది. ‘ఆర్ఆర్ఆర్’ 2021 జనవరి 8న విడుదలవుతుందని నిర్మాతలు బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో జూనియర్ ఎన్టిఆర్, రాంచరణ్ హీరోలుగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ కూడా పాల్గొంటున్నారు. అలియాభట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీలో సముద్రకని విలన్‌గా నటిస్తున్నారు. షూటింగ్ షెడ్యూల్స్ అనుకున్న విధంగా జరగకపోవడం, తీవ్ర జాప్యం జరగడం, పోస్ట్ ప్రొడక్షన్‌కు చాలా సమయం కావాల్సి రావడం వంటి కారణాలతో ‘ఆర్ఆర్ఆర్’ ముందుగా ప్రకటించినట్లు జూలై 30న విడుదలయ్యే అవకాశాలు లేవనే విషయం ముందుగానే బయటకు వచ్చింది. అక్టోబర్‌లో దసరా సీజన్లో ఆ సినిమా విడుదల అవుతుందని సోషల్ మీడియాలో విరివిగా ప్రచారమైంది. అయితే అక్టోబర్‌లోనూ ‘ఆర్ఆర్ఆర్’ విడుదలయ్యే అవకాశం లేదనీ, అసలు ఆ సినిమా 2020లో రావట్లేదనీ, 2021 సంక్రాంతి సీజన్లో రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని మొదటగా వెల్లడించింది పలువార్తలు రావడం గమనార్హం. ఈ వార్తలను ఇప్పుడు నిర్మాత దానయ్య నిజం చేశారు. 2020 సంక్రాంతికి విడుదలైన ఇద్దరు స్టార్ల సినిమాలు సూపర్ హిట్ అవడంతో, ‘ఆర్ఆర్ఆర్’ని సంక్రాంతికి తీసుకొస్తే కమర్షియల్‌గా బాగా వర్కవుట్ అవుతుందనే అభిప్రాయంతో జనవరి 8ని రిలీజ్ డేట్‌గా ఫైనలైజ్ చేశారు. ‘ఇంతకు ముందు మీరు ఎప్పుడూ చూడని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి మేం అహర్నిశలు కష్టపడుతున్నాం. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేయడంతో విడుదల తేదీని వాయిదా వేయుట తప్పడం లేదు. జనవరి 8న, 2021న ‘ఆర్ఆర్ఆర్’ థియేటర్లలోకి వస్తోంది. ప్రేక్షకులు చాలా ఎక్కువ రోజులు ఎదురు చూడాలి అని మాకు తెలుసు. అయితే మధ్యలో అప్డేట్స్ ఇస్తామని అని ప్రామిస్ చేస్తున్నాం’ అని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ట్వీట్ చేసింది. కాగా, విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెలాఖరులోగా ‘ఆర్ఆర్ఆర్’ కాన్సెప్ట్ టీజర్ రిలీజ్ కానున్నది. అలాగే రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్‌లుక్, తారక్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్‌లుక్ విడుదల కానున్నాయి.
2021 సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’
RELATED ARTICLES