గగన్‌యాన్ మిషన్‌కు ఐఎఎఫ్ నుంచి నలుగురి ఎంపిక: ఇస్రో
బెంగళూరు: చంద్రుడిపైకి మూడో మిషన్ చంద్రయాన్ వచ్చే ఏడాది చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) బుధవారం తెలిపింది. ఇక ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ కార్యక్రమానికి భారత వాయుసేన నుంచి నలుగురిని ఎంపికచేసినట్లు కూడా తెలిపింది. ఆ నలుగురికి అంతరిక్ష యాత్రికుడి శిక్షణను త్వరలో రష్యాలో మొదలెట్టనున్నట్లు వెల్లడించింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ 2020లో చంద్రయాన్ ప్రయోగించనున్నట్లు ప్రకటించిన మరునాడే ఇస్రో ఈ ప్రకటనచేసింది. ఇస్రో చైర్మన్ కె శివన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రయాన్ సం బంధించిన కార్యక్రమాలు సాఫీగా సాగుతున్నాయన్నారు. ప్రతిష్ఠాత్మక చంద్రయాన్ ప్రాజెక్టుకు ప్రభుత్వ ఆమోదం లభించిందని ప్రకటించారు. చంద్రయాన్ ప్రాజెక్టు చంద్రయాన్ తరహాలోనే ఉంటుందన్నారు. ‘చంద్రయాన్ ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉండేవి. చంద్రయాన్ ప్రొపల్షన్ మాడ్యూల్తో కూడిన ల్యాండర్, రోవర్ ఉంటాయి’అని శివన్ వెల్లడించారు. గగన్‌యాన్, చంద్రయాన్ ప్రాజెక్టులతో కొత్త సంవత్సరం ఇస్రో చరిత్రలో మైలురాయిగా నిలిచిపోనుందన్నారు. 2019 లో ఇస్రో అనేక విజయాలు సాధించిందని గుర్తుచేశారు. 2019లో గగన్‌యాన్ ప్రాజెక్టులో ఎంతో పురోగతి సాధించామన్నారు. గడిచిన ఏడాదిలో ప్రధానంగా ఇస్రో విస్తరణపై దృష్టిపెట్టామన్నారు. మరిన్ని మిషన్లు ఇస్రో సామర్థ్యాన్ని పెంచే దిశగా సాగుతున్నామన్నారు. ఈ క్రమంలో రెండో స్పేస్‌పోర్ట్ నిమిత్తం తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతంలో భూసేకరణ చేశామని తెలిపారు. చంద్రయాన్ ప్రాజెక్టును 2020లోనే చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం వెల్లడించిన మరుసటి రోజే శివన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. చంద్రయాన్ విఫల ప్రాజెక్టుగా పరిగణించడం తగదని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశమూ తొలి ప్రయత్నంలోనే జాబిల్లిపై ల్యాండర్‌ను దించలేకపోయిందని గుర్తుచేశారు. చంద్రయాన్ సముపార్జించుకున్న అనుభవం, ఇప్పటికే అందుబాటులో ఉన్న పలు మౌలిక వసతులు నూతన ప్రాజెక్టులో కీలకంగా మారుతాయని.. చంద్రయాన్ పోలిస్తే కొత్త ప్రాజెక్టు వ్యయం తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. భవిష్యత్ మిషన్ల గురించి మాట్లాడుతూ శివన్ ‘2020కు 25 మిషన్లను ప్లాన్ చేశాము’ అన్నారు. విక్రమ్ ల్యాండర్ వైపల్యాని కారణమేమిటని ప్రశ్నించినప్పుడు ఆయన జవాబిస్తూ ‘వేగాన్ని తగ్గించే వ్యవస్థ విఫలమవ్వడం వల్లే ల్యాండర్ ఉపరితలాన్ని గట్టిగా ఢీకొట్టింది’ అని చెప్పారు. ఈ సందర్భంగా ల్యాండర్ జాడను కనుగొనడంలో సహాయపడిన చెన్నైకి చెందిన యువకుడు షణ్ముగ సుబ్రహ్మణ్యన్ను అభినందించారు. కాగా కూలిపోయిన మాడ్యుల్ చిత్రాలను విడుదలచేయడం ఇస్రో పాలసీ కాదన్నారు. గగన్‌యాన్ మిషన్‌కు రష్యా, ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు. భారత ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ మిషన్ గురించి ప్రధాని నరేంద్ర మోడీ 2018 స్వతంత్ర దినోత్సవంనాడు ప్రకటించారన్నది ఇక్కడ గమనార్హం. ఇదిలా ఉండగా రోదసి కార్యక్రమాలకు 2020 బడ్జెట్లో కేంద్రం రూ. 14,000 కోట్లను కేటాయించాలని ఇస్రో కోరింది.
2021లో చంద్రయాన్-3
RELATED ARTICLES