అందులో భారత్ ద్వితీయ స్థానం
బ్రస్సెల్ : ప్రపంచ వ్యాపిత కరోనా అంటువ్యాధితోపాటు, జర్నలిస్టుల హత్యల్లో కూడా 2020 సంవత్సరం చరిత్రకెక్కింది. 2019లో ప్రపంచ వ్యాపితంగా 49 మంది జర్నలిస్టులు హత్యకు గురైతే, 2020లో 60 మందిని పొట్టన పెట్టుకున్నారు. యిందులో మెక్సికోలో 14 మంది, భారతదేశంలో 8మంది జర్నలిస్టులున్నారు. పాకిస్థాన్ ఆప్ఘనిస్థాన్ ఫిలిప్పీన్స్ సిరియా కాగా, ఇరాక్, నైజీరియాల్లో ముగ్గురి చొప్పున సోమాలియాలో యిద్దరు, బంగ్లాదేశ్, కెమరూన్, కొలంబియా, హోండురస్, పెరుగ్వె, రష్యా, స్వీడన్, యెమెన్‌లలో ఒక్కరి చొప్పున హత్యకు గురైనారు. రష్యాలో మహిళా జర్నలిస్టు వేధింపులకు గురై దానికి బాధ్యులు అధికారులేనని నిప్పంటించుకుని ప్రాణాలు కోల్పోయింది. మెక్సికోలో నేర సామ్రాజ్యానికి, భారత్‌లో అసహనం ప్రదర్శించే మౌఢ్యులకు జర్నలిస్టులు బలయ్యారు. యితర దేశాలలో తీవ్రవాదులు బలితీసుకున్నారు.
2020లో 60 మంది జర్నలిస్టుల హత్య!
RELATED ARTICLES