కాకతీయుల సామ్రాజ్యం గురించి రుద్రమదేవి చిత్రం ద్వారా కంటికి కట్టినట్లు చూపించిన గుణశేఖర్ చాలా విరామం తరువాత మరో సాహసానికి సిద్ధం అవుతున్నాడు. చారిత్రక చిత్రల పట్ట మక్కువనో.. లేదా భారీ చిత్రాల పట్ల ఆయనకున్న అభిమానమో తెలియదు కాని.. ప్రస్తుతం ఆయన ప్రహ్లాదుడి కథతో హిరణ్యకశ్యప అనే సినిమాను తెరకెక్కించనున్నట్టుగా చాలా రోజుల కిందటే ప్రకటించాడు. ఈ పౌరాణిక గాథను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలనే యోజనలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు యంగ్ హీరో రానా ద్గుబాటి ఈ సినిమాలో టైటిల్ రోల్‌లో నటిస్తూ ఈ సినిమాను నిర్మాణ బాధ్యతలు కూడా భుజాన వేసుకున్నాడట. కాగా, తాజాగా ఈ ప్రాజెక్టు గురించి మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్‌లో గుసగుసలాడుతోంది. హిరణ్యకశ్యప సినిమాను దర్శకుడు గుణశేఖర్ దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందించే ఆలోచనలో ఉన్నాడని, అయితే మార్కెట్ పరంగా గుణశేఖర్‌గాని, రానా గాని సోలోగా ఇంత వరకు వంద కోట్ల మార్క్‌ను అందుకోలేదు. అందుకే అంత బడ్జెట్‌తో హిరణ్యకశ్యపను తెరకెక్కించటం సాహసమే అని భావిస్తున్నారు విశ్లేషకులు. ఈ భారీ ప్రయోగంలో గుణ మరోసారి విజయం సాధింస్తాడేమో చూడాలి.
200 కోట్లతో ‘హిరణ్యకశ్యప’
RELATED ARTICLES