నెలాఖరుకు మెమోలు
ప్రజాపక్షం/హైదరాబాద్: కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పదవ తరగతి ఫలితాలు ఈనెల 20వ తేదీ నాటికి వచ్చే అవకాశం ఉంది. అంతర్గత పరీక్షల ఆధారంగా వారికి వంద మార్కులు ఎంత వస్తాయో నిర్ధారించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే 20 మార్కులకు సంబంధించిన అంతర్గత పరీక్షల వివరాలు బోర్డు వద్ద ఉన్నారు. వాటిని వంద మార్కులకు అన్వయించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇదంతా ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ నిర్ణయంతో సింహ భాగం పదవ విద్యార్థులకు 9 నుండి 10 గ్రేడింగ్ పాయింట్‌లు రావచ్చునని సమాచారం. మెమోలు ముద్రించి ఈ నెలాఖరు వరకు ఆయా పాఠశాలకు పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
20వ తేదీ నాటికి టెన్త్ ఫలితాలు
RELATED ARTICLES