న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 200కి పైగా దేశాలను ఇంకా వణికిస్తూనే వుంది. దీని ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు. లాక్‌డౌన్‌ను కఠినంగా పాటించిన దేశాల్లో మాత్రమే వైరస్ ప్రభావం ఓ మాదిరిగా వుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 27,52,692కి పెరగ్గా, మరణాల సంఖ్య 1,92,262కి చేరుకున్నది. అంటే 2 లక్షలకు చేరువగా మరణాలు కదులుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ప్రధానంగా ఈ వైరస్‌తో అల్లాడిపోతున్నది. అమెరికాలో ఇప్పటివరకు కొవిడ్ 19 కేసులు 8,87,622కి చేరగా, మరణాలు 50 వేలు దాటాయి. మృతుల సంఖ్య అరలక్ష దాటడం పట్ల ఆ దేశ
అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనే దిశగా అమెరికా ప్రయాణిస్తున్నదని, ఈ విజయానికి చేరువలో వున్నామని వ్యాఖ్యానించారు. కరోనా తాకిడికి బలైన దేశాల జాబితాలో ఇటలీ రెండో స్థానంలో నిలిచింది. అక్కడ మొత్తం 1,89,973 కేసులు నమోదుకాగా, 25,549 మంది మరణించారు. స్పెయిన్ మూడో స్థానంలో వుంది. ఈ దేశంలో కేసుల సంఖ్య ఇటలీ కన్నా ఎక్కువగానే ఉన్నప్పటికీ, మరణాలు మాత్రం 22,524కి చేరాయి. ఫ్రాన్స్‌లో కరోనా కేసుల సంఖ్య 1,58,183కి చేరగా, మరణాలు 21,856 దాటింది. బ్రిటన్‌లో కేసులు 1,38,078 దాటగా, మరణాలు 18,738కి చేరాయి. జర్మనీలో మరణాల సంఖ్య 5,577కి, ఇరాన్‌లో మరణాలు 5,574కి చేరుకున్నాయి. రష్యాలో కేసులు 70 వేలకు చేరువలో ఉన్నప్పటికీ, మరణాలు కేవలం 615 మాత్రమే వున్నాయి. అక్కడ చికిత్సలో ముందడుగు వేస్తూ మరణాలను నివారించగలుగుతున్నారు. బెల్జియంలో 6,679, బ్రెజిల్‌లో 3,343 మరణాలు సంభవించాయి.
2 లక్షలకు చేరువగా!
RELATED ARTICLES