ఓట్ల తేడా వస్తే వివి ప్యాట్‌లే ఫైనల్
సర్వసన్నద్ధంగా ఉన్నాం: సిఇఒ రజత్‌కుమార్
ప్రజాపక్షం/హైదరాబాద్: “లోక్‌సభ ఫలితాలపై అనుమానం వస్తే రీ కౌంటింగ్ కోరేందుకు రెండు నిమిషాలే వ్యవధి ఇస్తారు. కౌంటింగ్ పూర్తయిన ఫలితం అం కెలపై అనుమానాలు ఉంటే అభ్యర్థి తక్షణమే కౌంటింగ్ సెంటర్‌లో రిటర్నింగ్ అధికారిని రీకౌంటింగ్ కోరాలి. ఆ మేరకు లిఖితపూర్వకంగా లేఖ ఇవ్వాలి. ఆ లేఖ ఆధారంగా రీ కౌంటింగ్ నిర్వహించాలా..? వద్దా అనే నిర్ణయాధికారాన్ని రిటర్నింగ్ అధికారికే కట్టబెట్టినట్లు” రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. అలాగే ఎంపిక చేసిన ఇవిఎం, వాటి వివి ప్యాట్‌లలో పోలైన ఓట్ల సంఖ్య తేడా వస్తే, వివి ప్యాట్ స్లిప్పులనే పరిగణలోకి తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ఒక వేళ వివిప్యాట్ ఓట్లు తక్కువగా ఉండి, ఇవిఎం యంత్రాల్లో ఓట్లు ఎక్కువగా దీనిని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తారు. అన్నీ అనుమానాలు, లెక్కింపు ప్రక్రియ పూర్తున తర్వాతనే ఫలితాలను వెల్లడించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశామని సిఇఒ రజత్‌కుమార్ సచివాలయంలో బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రిటర్నింగ్ అధికారులు పనిచేయాలని, ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు, పొరపాట్లు లేకుండా చూడాలని ఆయన ఎన్నికల నిర్వహణ సిబ్బందికి వివరించారు. 2013 సంవత్సరం నుంచి ఇవిఎం యంత్రాలను ఉపయోగిస్తున్నామని, పొరపాట్లు జరగలేదన్నారు. ఈసారి ఓట్లు లెక్కింపు కేంద్రాల వద్ద సువిధ పోటల్ ద్వారా ఎప్పటికప్పుడు ఓట్ల లెక్కింపు ఫలితాలను ప్రదర్శిస్తామని తెలిపారు .అన్ని అనుమానాలు పూర్తున తర్వాతనే ఓట్ల ఫలితాలను వెల్లడిస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాలకు ఏజెంట్లు తమ వెంట ఫోన్లు తీసుకురావొద్దని సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 నియోజకవర్గాలకు గాను 443 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 119 నియోజకవర్గాల్లో 35 ప్రాంతాల్లో 126 కౌంటింగ్ హాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు సుమారు 6500 మంది సిబ్బంది ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో 17 ఏర్పాటు చేశారు.హైదరాబాద్‌లో 7, సికింద్రాబాద్‌లో 6 ప్రాంతాల్లో లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. లెక్కింపు కేంద్రాల వద్ద మంచినీటినుంచి మొదలు ఓట్ల లెక్కింపు తెరలు, ఇలా మౌలిక సదుపాయాలను కల్పించారు. ఎన్నికల నిర్వహణ, తీసుకోవల్సిన జాగ్రత్తలు, అధికారాలు, బాధ్యతలపై రెండు సార్లు ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చారు. కాగా నిజామాబాద్ నియోజకవర్గంలో అభ్యర్థులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో రెండు హాల్స్‌ను, ఒక్కో హాల్స్‌లో 18 టుబెల్స్ చొప్పున 36 ఏర్పాటు చేశారు.